Siddhu : కన్నీళ్లు పెట్టుకున్న సిద్ధార్థ్.. కారణం వాళ్లే!
ఇప్పుడంటే సిద్ధార్థ్ సినిమాలను పెద్దగా పట్టించుకోవట్లేదు గానీ.. ఒకప్పుడు సిద్ధార్త్‌కు తెలుగులో భారీ డిమాండ్ ఉండేది. గతంలో తెలుగులో మోస్ట్ వాంటేడ్ హీరోగా ఉన్న సిద్దార్థ్.. ప్రస్తుతం వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు.
స్టార్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) చేసిన ‘బాయ్స్’ సినిమాతో.. హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు సిద్ధార్థ్. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు సిద్ధు. బొమ్మరిల్లు (Bommarillu), నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. వంటి బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ఆ తర్వాత మినిమం గ్యారెంటీ సినిమాలు చేశాడు. కానీ ఈ మధ్య రేసులో వెనకబడిపోయాడు సిద్ధు. అయినా కూడా ప్రస్తుతం శంకర్(Shankar)తో ఇండియన్ 2లో నటిస్తున్నాడు. 20 ఏళ్ల తర్వాత తనకు లైఫ్ ఇచ్చిన శంకర్‌తో సినిమా చేయడం తన అదృష్టం అంటున్నాడు.
అలాగే ఇంకొన్ని సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ మధ్య టక్కర్ (Tucker) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సిద్దార్థ్. కానీ ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు చిట్టా అనే సినిమాను తెలుగులో చిన్నా పేరుతో రీమేక్ చేస్తున్నాడు. ఇప్పటికే తమిళ్(Tamil)తో పాటు కన్నడ, మలయాళ రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేశాడు. సెప్టెంబర్ 28న విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాక ప్రతి తల్లిదండ్రులు తప్పక చూడాల్సిన సినిమా ఇదని అంటున్నారు.
కానీ తెలుగులో మాత్రం ఈ సినిమా ఆ సమయానికి రిలీజ్ కాలేదు. తెలుగులో ఈ సినిమాను కొనడానికి ఎవరు కూడా ముందుకు రాలేదట. ఇదే విషయాన్ని చెబుతూ ఈ సినిమా ప్రెస్ మీట్లో ఎమోషనల్ అయ్యాడు సిద్దార్థ్. మిగతా భాషల్లో నా సినిమాను మెచ్చుకున్నారు.. కానీ తెలుగులోసిద్ధార్థ్ (Siddharth)సినిమా ఎవరు చూస్తారు? అని అడిగారు. నేను ఒక మంచి సినిమా చేస్తే ప్రేక్షకులు నా సినిమా చూస్తారని చెప్పాను. అలాంటి సమయంలో నేను నీతో ఉన్నానని చెప్పి నా సినిమా డిస్ట్రిబ్యూట్ చేశారు ఏషియన్ సునీల్ గారు.. అని సిద్ధార్థ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.