తగ్గేదేలే.. ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇదే. ఏ విషయం తీసుకున్నా సరే.. ఇంకొకరి కోసం నేనేందుకు తగ్గాలి అనే ఆలోచనలోనే ఉన్నారు. కానీ కొన్ని విషయాల్లో తగ్గాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా భార్య భర్తలు ఒకరినొకరు అర్ధం చేసుకొని.. అడ్జెస్ట్మెంట్ అవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ప్రస్తుతం ప్రాబ్లమ్స్ పక్కకు పెట్టి.. చిన్న చిన్న ఇగోలకు పోయి విడాకులు తీసుకుంటున్నారు చాలామంది. ఇక సెలబ్రిటీస్ల విషయంలో డివోర్స్ మ్యాటర్ అభిమానుకులకు కలవరపెడుతునే ఉంది. ఇప్పటికీ సమంత, నాగ చైతన్య డివోర్స్ గురించి చర్చించుకుంటునే ఉన్నారు జనాలు. అది కూడా కొంత కాలం ప్రేమలో ఉండి.. పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకొని.. నాలుగేళ్లకు విడిపోయారు. దాంతో అక్కినేని అభిమానులు ఎంతో నిరాశకు గురయ్యారు. ఇక ఆ తర్వాత కోలీవుడ్ హీరో ధనుష్ కూడా విడాకులు ప్రకటించి షాక్ ఇచ్చాడు. దాదాపు 18 ఏళ్ల తర్వాత ధనుష్-ఐశ్వర్య విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే ఈ విషయంలో రజనీ కాంత్ కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదని వినిపించింది. కానీ ఇప్పుడు ఐశ్వర్య తండ్రి రజనీ కాంత్, ధనుష్ తండ్రి కస్తూరి రాజా.. ఈ ఇద్దరిని ఒకటి చేసేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. దాంతో పెద్దల మాట కాదనలేక.. పిల్లల కోసం ఇద్దరు కలిసి ఉండేందుకు.. విడాకులు రద్దు చేసుకునేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు.