Mahesh Babu : మామూలుగా సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ కాస్త ఎక్కువ. ఏది చేసినా.. సరైన ముహూర్తం చూసుకుంటారు. అలాగే హిట్, ఫట్ సెంటిమెంట్ ఫాలో అవుతుంటారు. అదే ఇప్పుడు ఎస్ఎస్ఎంబీ 28 విషయంలోను జరుగుతోంది. ఇప్పటికే త్రివిక్రమ్‌కు 'అ' సెంటిమెంట్‌లో భాగంగా.. ఈ సినిమాకు అర్జునుడు, అయోధ్యలో అర్జునుడు అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి.
మామూలుగా సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ కాస్త ఎక్కువ. ఏది చేసినా.. సరైన ముహూర్తం చూసుకుంటారు. అలాగే హిట్, ఫట్ సెంటిమెంట్ ఫాలో అవుతుంటారు. అదే ఇప్పుడు ఎస్ఎస్ఎంబీ 28 విషయంలోను జరుగుతోంది. ఇప్పటికే త్రివిక్రమ్‌కు ‘అ’ సెంటిమెంట్‌లో భాగంగా.. ఈ సినిమాకు అర్జునుడు, అయోధ్యలో అర్జునుడు అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా టైటిల్ పై క్లారిటీ రానుంది. అయితే ఫ్లాప్ సెంటిమెంట్ విషయలంలో మాత్రం మహేష్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అన్ని అనుకున్నట్టు జరిగి ఉంటే.. సమ్మర్లోనే ఈ సినిమా రిలీజ్ అయి ఉండేది. కానీ షూటింగ్ డిలే అవడంతో.. ఆగష్టు 11న రిలీజ్ చేస్తామని మేకర్స్ చెప్పుకొచ్చారు. అయితే అప్పటికీ కూడా ఎస్ఎస్ఎంబీ 28 రిలీజ్ అవడం కష్టం అని తేలిపోయింది. ఆగష్టు 11న మెగాస్టార్ ‘భోళాశంకర్’ రిలీజ్ కాబోతోంది. దీంతో దసరా సందర్భంగా.. అంటే అక్టోబర్‌లో రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది. గతంలో అక్టోబర్‌లో రిలీజ్ అయిన మహేష్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేశాయి. వంశీ, బాబి, అతిథి.. సినిమాలు అక్టోబర్ నెలలోనే రిలీజ్ అయ్యాయి. అలాగే మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘ఖలేజా’ కూడా అక్టోబర్ నెలలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఫ్లాప్ సెంటిమెంట్ కారణంగానే.. ఎట్టి పరిస్థితుల్లోను ఎస్ఎస్ఎంబీ 28ని అక్టోబర్‌లో రిలీజ్ చేయొద్దని అంటున్నారు అభిమానులు. మహేష్ కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. పోని సంక్రాంతికి వద్దామంటే.. ప్రభాస్, రామ్ చరణ్ సినిమాలు లైన్లో ఉన్నాయి. మరి ఎస్ఎస్ఎంబీ 28 రిలీజ్ ఎప్పుడుంటుందో చూడాలి.