»Shocking News Kajal Made A Promise To Her Husband Before Marriage
Kajal : షాకింగ్ న్యూస్.. పెళ్లికి ముందే కాజల్‌కి భర్త అలాంటి కండీషన్!
టాలీవుడ్లో ఉన్న స్టార్ హీరోలందిరితోను రొమాన్స్ చేసింది చందమామ కాజల్ అగర్వాల్. కొన్నేళ్లు స్టార్ డమ్ అనుభవించిన ఈ ముద్దుగుమ్మ.. 2020లో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకుంది. ఓ బాబుకి కూడా జన్మనిచ్చింది. అయితే తాజాగా కాజల్‌కు తన భర్త పెళ్లికి ముందే ఓ కండీషన్ పెట్టాడనే న్యూస్ వైరల్‌గా మారింది. ఇంతకీ కాజల్‌కి కిచ్లూ పెట్టిన ఆ కండీషన్ ఎంటీ?
పెళ్లి చేసుకొని కొన్నాళ్లు భర్తతో కలిసి ఎంజాయ్ చేసిన కాజల్(Kajal).. 2022లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దాంతో కొన్నాళ్లు సినిమాలకు దూరం కావాల్సి వచ్చింది. కానీ ఇటీవలె కమల్ హాసన్-శంకర్ కాంబోలో రీస్టార్ అయిన ‘ఇండియన్ 2’ షూటింగ్లో జాయిన్ అయింది. ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేసింది. ప్రస్తుతం అమ్మడికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘భగతవంత్ కేసరి’ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది కాజల్. ఈ సినిమాలో శ్రీలీలకు తల్లి పాత్రలో నటిస్తోంది.
అలాగే రీసెంట్గా ‘సత్యభామ’ అనే సినిమాకు కూడా కమిట్ అయింది. లేడీ ఓరియేంటెడ్‌గా రానున్న ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతోంది కాజల్(Kajal). ఇదిలా ఉంటే.. పెళ్లికి ముందు కాజల్‌కి తన భర్త గౌతమ్ కిచ్లూ ఓ కండిషన్ పెట్టారట. అందుకు కాజల్ ఓకే చెప్పిన తర్వాతే వీళ్ల పెళ్లి జరిగిందనే న్యూస్ వైరల్‌గా మారింది. ఎంత స్టార్డమ్, క్రేజ్ ఉన్నప్పటికీ పెళ్లైన తర్వాత చాలామంది హీరోయిన్లు సంసార జీవితానికే అంకితమయ్యారు. కానీ కాజల్ అలా కాదు.. రీ ఎంట్రీలోను దుమ్ములేపుతోంది.
అందుకే తన భర్త ముందే ఓ కండీషన్ పెట్టాడట. సినిమా షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. ఎలాంటి సిట్యువేషన్లో ఉన్నా కూడా.. ప్రతిరోజు తనతో ఒక గంట సమయాన్ని కేటాయించాలి.. అని ముందే మాట తీసుకున్నాడట. కేవలం అది మాత్రమే తన దగ్గర నుండి ఆశిస్తున్నాని చెప్పారట. కాజల్(Kajal) కూడా ఈ కండిషన్‌కి ఒకే చెప్పిందట. అందుకే సమయం దొరికినప్పుడల్లా భర్తతో టైం స్పెండ్ చేసేందుకు ట్రై చేస్తోందట అమ్మడు. కానీ గౌతమ్ కూడా బిజినెస్ పరంగా ఫుల్ బిజీ కాబట్టి.. ఇద్దరికి సమయం దొరకడం లేదని అంటున్నారు. ఏదేమైనా.. సినిమా వాళ్ల లైఫ్ తెలుసు కాబట్టే.. కిచ్లూ ఇలాంటి కండీషన్ పెట్టాడని చెప్పొచ్చు.