Anirudh: షాకింగ్.. రెహమాన్ కాదట, అనిరుధ్ టాప్ అట?
ఈ మధ్య కాలంలో.. అభిమానులు డిమాండ్ చేసే ఏకైక మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే.. అనిరుధ్(Anirudh) అనే చెప్పాలి. ఈ కోలీవుడ్ యంగ్ టాలెంట్ ఇచ్చే మ్యూజిక్ ఓ రేంజ్లో ఉంటుంది. ముఖ్యంగా బీజీఎం నెక్స్ట్ లెవల్ అనేలా ఉంటుంది. అందుకే అతనికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఎంతలా అంటే.. పారితోషికంలో రెహమాన్‌ను కూడా వెనక్కి నెట్టేశాడట.
ప్రజెంట్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్(anirudh ravichander). ఏ సినిమా అనౌన్స్మెంట్ వచ్చిన సరే, తననే మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అభిమానులు. తమన్, దేవిశ్రీ ప్రసాద్‌లను సైతం పక్కకు పెట్టేసి అనిరుధ్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో విక్రమ్ సినిమాకు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ తెప్పించింది. అప్పటి నుంచి అనిరుధ్‌కి మరింత డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్ టాప్ మూవీస్‌కి ఈ యంగ్ టాలెంట్ సంగీతం అందిస్తున్నాడు. ప్రజెంట్ సెట్స్ పై ఉన్న లియో, దేవర సినిమాలకు ఈయనే మ్యూజిక్ ఇస్తున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న రజనీ కాంత్ ‘జైలర్’ సాంగ్ ‘కావాలయ్య’ను కూడా అనిరుధే కంపోజ్ చేశాడు. అందుకే ఇప్పుడు ఏకంగా ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్‌ని సైతం అనిరుధ్ వెనక్కి నెట్టేసినట్టు తెలుస్తోంది.
రెహమాన్ రెమ్యునరేషన్(Remuneration) రూ.8 కోట్లేనట.. కానీ అనిరుధ్ మాత్రం రెహమాన్ కంటే రూ.2 కోట్లు ఎక్కువే తీసుకుంటున్నాడట. బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘జవాన్’కి కూడా అనిరుధ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఆట్లీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ ఏకంగా రూ.10 కోట్లు(rs 10 crore) ఛార్జ్ చేశాడట. తెలుగులో తమన్ రూ.4 నుంచి రూ.5 కోట్లు అందుకుంటున్నాడు. పవన్ భీమ్లానాయక్‌కి రూ.4 కోట్లు, మహేశ్ గుంటూరు కారానికి రూ.5 కోట్లు చార్జ్ చేస్తున్నాడు తమన్. ఇక దేవిశ్రీ పుష్పకి రూ.7 కోట్లు తీసుకోగా.. పుష్ప 2 కి రూ.8 కోట్లు రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు. కానీ అనిరుధ్ మాత్రం రెహమాన్‌ను కూడా బీట్ చేసేశాడని అంటున్నారు. మొత్తంగా రెమ్యునరేషన్ విషయంలో అనిరుధ్‌దే టాప్ ప్లేస్ అంటున్నారు.