Shaakuntalam:గుణశేఖర్ (Gunasekhar) శాకుంతలం మూవీ డిజాస్టర్‌గా మిగిలింది. ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. దీంతో ఈ సినిమా (cinema) ఎంత మేర నష్టపోయిందనే అంశం చర్చకు వచ్చింది. సినిమాను గుణశేఖర్ (Gunasekhar) ప్రొడ్యూస్ (produce) చేశారు. రూ.40 కోట్ల (rs.40 crores) వరకు ఖర్చు పెట్టగా.. మధ్యలో దిల్ రాజు (dil raju) కలిశారు. బడ్జెట్ (budget) పెరిగి రూ.54 కోట్లకు చేరిందట.. త్రిడీలో విడుదల చేసేందుకు మరో రూ.10 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. దీంతో మూవీకి అయిన మొత్తం రూ.64 కోట్లు (64 crores) అని తెలిసింది.
మూవీపై బయ్యర్లకు పెద్దగా నమ్మకం లేదు. ఎన్ఆర్ఎ పద్దతిలో తీసుకోవడానికి ముందుకు రాలేదు. రిటర్నబుల్ అడ్వాన్స్ మీద సినిమాను ఇచ్చారు. నాన్ థియేటర్, అన్నీ కలిపి రూ.40 కోట్ల వరకు (rs.40 crores) రికవరీ వచ్చింది. మరో రూ.24 కోట్లు రావాల్సి ఉంది. 5 రోజుల్లో గ్రాస్ కలెక్షన్ రూ.8.40 కోట్లు కలెక్షన్ వచ్చాయి. అంటే రూ.14 కోట్ల నష్టం చవిచూసింది.
శాకుంతలం (Shaakuntalam) మూవీకి ఫస్ట డే కోటి రూపాయల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. తర్వాత సగానికి పడిపోయాయి. ఐదో రోజు ఏపీ, తెలంగాణలో 12 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 2.37 కోట్ల షేర్ కలెక్షన్ సొంతం చేసుకుంది. తమిళనాడులో 33 లక్షలు, కర్ణాటక సహా దేశవ్యాప్తంగా రూ.36 లక్షలు, ఓవర్సీస్లో 98 లక్షల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల షేర్.. 8.40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. స్ట్రీమింగ్ పార్ట్నర్ కూడా ఆశించిన స్థాయిలో ఇచ్చే అవకాశం లేదు. అన్నీ కలిపినా.. నష్టాలు మాత్రం బానే ఉండేట్టు ఉన్నాయి.
మూవీలో మెజార్టీ వాటా గుణశేఖర్ (Gunasekhar) అయి ఉంటుంది. తొలుత ఆయనే రూ.40 కోట్ల వరకు ఖర్చు చేశారు. మిగతా 24 కోట్ల వరకు దిల్ రాజు పెట్టుబడి పెట్టి ఉంటారు. ఏ లెక్కన చూసినా.. గుణశేఖర్ నష్టాలను మూటగట్టుకుంటారు.