తెలుగు సీనియర్ నటి జమున అంత్యక్రియలు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో సాయంత్రం ముగిశాయి. జమునకు తన కూతురు అంత్యక్రియలు నిర్వహించింది. జమున చివరి చూపు చూసేందుకు అభిమానులు భారీగా మహా ప్రస్థానానికి తరలివచ్చారు. జమున కొడుకు అమెరికా నుంచి రావడానికి ఇంకా సమయం పడుతుండటంతో ఆమె కూతురు స్రవంతి రావు జమున చితికి నిప్పంటించారు.
జమున పార్థీవ దేహం మహా ప్రస్థానానికి చేరుకున్నాక.. మా అసోసియేషన్ సభ్యులు జీవితతో పాటు ఇతర సభ్యులు ఆమెకు నివాళులర్పించారు. ఏపీ మంత్రి రోజా, మురళీ మోహన్, నిర్మాత సుబ్బిరామిరెడ్డి తదితరులు ఆమెకు కన్నీటి వీడ్కోలు పలికారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జమున తన 86 ఏళ్ల వయసులో హైదరాబాద్ లోని తన నివాసంతో ఇవాళ ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే.