కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ‘విక్రమ్’ మూవీతో భారీ బ్లాక్‌బస్టర్ సొంతం చేసుకున్నాడు యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. దాంతో ప్రస్తుతం అటు తమిళ్, ఇటు తెలుగు హీరోల అందరి చూపులు లోకేష్ పైనే ఉన్నాయి. అందుకు తగ్గట్టే అప్ కమింగ్ ఫిల్మ్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నాడు లోకేష్. గతంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో ‘మాస్టర్’ సినిమా తీసి హిట్ అందుకున్న లోకేష్.. మరోసారి ఇళయ దళపతితో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కూడా లోకేష్ స్టైల్లో అవుట్ అండ్ అవుట్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రాబోతోంది.
ప్రస్తుతం విజయ్ ‘వారసుడు’ అనే సినిమాలో నటిస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ ప్రాజెక్ట్ అయిపోగానే లోకేష్ సినిమాలో జాయిన్ అవనున్నాడు విజయ్. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ సినిమాలో కెజియఫ్ విలన్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. కెజియఫ్ చాప్టర్ 2లో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్‌గా అదరొట్టేశాడు. హిందీ మార్కెట్ దగ్గర కెజియఫ్2కు సంజయ్ దత్ ఎంతో హెల్ప్ అయ్యాడు. ఈ క్రమంలో తాజాగా విజయ్ సినిమాలోను ఆయననే విలన్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో సంజయ్‌ను కెజియఫ్ చాప్టర్2లో కంటే భయంకరమైన విలన్‌గా చూపించబోతున్నాడట లోకేష్. అందుకుగాను భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్టు టాక్. మేకర్స్ కూడా అడిగినట్టుగా పది కోట్ల పారితోషికం ఆఫర్ చేయడంతో.. సంజయ్ ఓకే చెప్పినట్టు టాక్. మరి ఈ సారి సంజయ్ దత్‌ను లోకేష్ ఎంత క్రూరంగా చూపిస్తాడో చూడాలి.