Samyuktha Menon : దానిని అస్సలు నమ్మనంటున్న విరూపాక్ష బ్యూటీ
టాలీవుడ్ లో ప్రస్తుతం లక్కీ గర్ల్ ఎవరంటే ఠక్కున గుర్తుకు వచ్చేది సంయుక్త మీనన్(Samyuktha Menon). ఈ మలయాళ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టేస్తూ నిర్మాతల ఫస్ట్ చాయిస్ అయింది. కెరీర్ల్ ప్రస్తుతం పీక్ స్థాయిలో ఉంది.
Samyuktha Menon : టాలీవుడ్ లో ప్రస్తుతం లక్కీ గర్ల్ ఎవరంటే ఠక్కున గుర్తుకు వచ్చేది సంయుక్త మీనన్(Samyuktha Menon). ఈ మలయాళ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టేస్తూ నిర్మాత(producers)ల ఫస్ట్ చాయిస్ అయింది. కెరీర్ల్ ప్రస్తుతం పీక్ స్థాయిలో ఉంది. బీమ్లా నాయక్(bheemla naik) మూవీలో రానా లవర్ గా నటించి మంచి ఫెర్మామెన్స్ కనబరిచింది. టాలీవుడ్ కు తన తాజా అందాలతో ఫ్రెష్ నెస్ కల్పించింది. తొలి మూవీ తోనే బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత సంయుక్త నటించిన సార్(sir), బింబిసార(bimbisara) చిత్రాలు కూడా వరుస విజయాలు సాధించాయి. చివరగా ఈ బ్యూటీ `విరూపాక్ష` మూవీ తో ప్రేక్షకులను అలరించింది. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఈ మిస్టరీ థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
టాలీవుడ్ లో కెరీర్ ఆరంభం నుంచి వరుస విజయాలు సాధిస్తూ లక్కీ బ్యూటీగా మారిన సంయుక్తకు.. ప్రస్తుతం వరుసగా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. యంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోలు కూడా సంయుక్త తో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ అమ్మడు తన సక్సెస్ సీక్రెట్ ను బహిర్గతం చేశారు. సినీ ప్రియులందరూ లక్కీ బ్యూటీ అని కొనియాడుతుంటే.. సంయుక్త మాత్రం తాను లక్ ను నమ్మనంటూ కుండబద్దలు కొట్టింది. నేను లక్ ని నమ్మను, అదే సక్సెస్ తన సీక్రెట్ అని సంయుక్త పేర్కొంది. విజయం అనేది టాలెంట్, స్క్రిప్ట్ సెలక్షన్ మీదే ఆధారపడి ఉంటుందని, లక్ వల్ల విజయాలు వరిస్తాయని తాను నమ్మను అంటూ సంయుక్త పేర్కొంది. సంయుక్త చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.