ప్రస్తుతం స్టార్ హీరోయిన్ సమంత మయో సైటిస్ అనే అరుదైన వ్యాధితో బాదపడుతున్న సంగతి తెలిసిందే. అందుకే నవంబర్ 11న రిలీజ్ కానున్న ‘యశోద’ సినిమా ప్రమోషన్స్‌కు దూరంగా ఉంది ఇన్ని రోజులు. అయితే ఇప్పుడు హెల్త్ సహకరించకపోయినా..
ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగిపోయింది సామ్. తాజాగా తన లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన ఫ్రెండ్ చెప్పినట్టు.. ఆ రోజు ఎంత కఠినంగా ఉన్నా తన మోటివ్ ఒక్కటేనని.. అనుకున్న పని చేసి చూపించాలి.. ఆ మోటివ్ నుంచే యశోద ప్రమోషన్స్ కోసం వస్తున్నానని పేర్కొంది. ఈ లుక్‌లో సమంతలో చాలా చేంజ్ ఓవర్ కనిపిస్తోంది. కాస డల్‌గా కనిపిస్తోంది. దాంతో యశోద పై అంచనాలతో పాటు.. సింపథి కూడా ఏర్పడుతోంది.
అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాత్రం సమంతను టెన్షన్ పెడుతున్నాడు. 2002 నవంబర్ 11న.. ‘ఈశ్వర్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్. దాంతో ఈ నెల 11వ తేదీకి హీరోగా ప్రభాస్‌కు 20 ఏళ్లు పూర్తవుతాయి. ఈ సందర్భంగా ప్రభాస్ అభిమానుల కోసం ‘వర్షం’ సినిమాను.. నవంబర్ 11న 4కె ప్రింట్‌తో భారీ ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు. ఈశ్వర్‌తో హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. వర్షం సినిమాతోనే స్టార్డమ్ అందుకున్నాడు ప్రభాస్. అందుకే ఈ సినిమాను మరోసారి థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసేందుక రెడీ అవుతున్నారు.
ఇక అదే రోజు యశోద థియేటర్లోకి రాబోతోంది. సమంత సినిమాకు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా పోటీ లేకపోయినా.. ‘యశోద’ ఓపెనింగ్స్ పై ‘వర్షం’ ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉందని అంటున్నారు. పైగా ఇప్పుడు రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. అందుకే యశోద మేకర్స్ కాస్త టెన్షన్ పడుతున్నట్టు ఇండస్ట్రీ టాక్. మరి యశోదగా సమంత ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.