»Samantha In White Dress At Isha Foundation Pics Viral On Social Media
Samantha: తెల్లటి దుస్తుల్లో సమంత..పిక్స్ వైరల్
సమంత తన ఆరోగ్యంపై దృష్టి పెట్టేందుకే నటనకు విరామం ఇచ్చింది. ఈ క్రమంలో ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ధ్యాన చేస్తున్న చిత్రాలను పంచుకుంది. తెల్లని దుస్తులలో ఇతర భక్తులతో కలిసి ధ్యానం చేస్తుంది
అనారోగ్య సమస్యల కారణంగా సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె తాను అంగీకరించిన అన్ని సినిమాల షూటింగ్స్ ని ఆమె పూర్తి చేసేసింది. ఆ తర్వాతే ఆరోగ్యంపై ఫోకస్ పెట్టింది. షూటింగ్స్ కి కంప్లీట్ గా బ్రేక్ ఇచ్చింది. త్వరలోనే అమెరికా వెళ్లి చికిత్స తీసుకోనుంది. ఈ క్రమంలో ఆమె ఆధ్యాత్మిక బాట చేపట్టారు. ఇటీవల చెన్నైలోని ప్రముఖ దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఇక, నిన్న కోయంబత్తూర్లో ఈషా ఫౌండేషన్లో ఆమె పాల్గొన్నారు. ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ నేతృత్వంలో ఆశ్రమంలో అనేక మందితో కలిసి ధ్యానంలో పాల్గొన్నారు.
అనంతరం, ధ్యానానికి ఇంత శక్తి ఉన్నట్టు తాను ముందు ఊహించలేకపోయానంటూ ఇన్స్టాలో తన అనుభూతిని పంచుకున్నారు. ఈ ఫోటోలు చూసి ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీలౌతున్నారు. ధ్యానం చేయడం వల్ల ఆమె మనసుకు ప్రశాంతత లభించిందని, అందుకే ఆమె ముఖంలో అంత సంతోషంగా కనపడుతోందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుండటం విశేషం. చైతూ విడిపోయిన తర్వాత కూడా సమంత ఇదే విధంగా దేవాలయాల చుట్టూ తిరిగొచ్చారు. కేదరనాథ్ లాంటి ప్రదేశాలు తన స్నేహితులతో కలిసి వెళ్లారు. కాగా, కొద్ది రోజుల్లో ఆమె చికిత్స కోసం అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు.