ఒక్కరోజు గ్యాప్‌లో ఇద్దరు బడా హీరోల సినిమాలు పాన్ ఇండియా రేంజ్లో భారీ ఎత్తున రిలీజ్ అయ్యాయి. ప్రభాస్ నటించిన సలార్, షారుఖ్ నుంచి డంకీ సినిమాలు థియేటర్లోకి వచ్చాయి. మరి సలార్ వర్సెస్ డంకీలో ఎవరు హిట్ కొట్టారు?
ఇప్పటి వరకు జరిగిన ఇండియాస్ బాక్సాఫీస్ బిగ్గెస్ట్ క్లాష్‌లో ఇదే పీక్స్ అనేలా సలార్, డంకీ రిలీజ్ అయ్యాయి. బ్యాక్ టు బ్యాక్ రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఇచ్చిన షారుఖ్ ఖాన్‌తో.. వరుసగా మూడు ఫ్లాప్స్ ఫేజ్ చేసిన ప్రభాస్ మధ్య గట్టి పోటీ ఏర్పడింది. ఈ స్టార్ హీరోల ఫ్యాన్స్ అయితే.. ఏకంగా కొట్టుకున్నంత పని చేశారు. ఫైనల్‌గా సలార్, డంకీ ఆడియెన్స్ ముందుకు వచ్చేశాయి. పఠాన్, జవాన్ హిట్ జోష్‌లో ఉన్న షారుఖ్.. సలార్ కంటే ఓ రోజు ముందే డంకీని రిలీజ్ చేశాడు. అయితే రెండు వరుస హిట్ సినిమాలు కూడా డంకీని కాపాడలేకపోయాయి. రాజ్ కుమార్ హిరాణీ బ్రాండ్, షారుఖ్ ఖాన్ ఇమేజ్ అండ్ క్రేజ్‌తో వచ్చిన డంకీ.. మంచి పాజిటివ్ బజ్‌తో రిలీజ్ అయింది.
కానీ నెగటివ్ టాక్ని, డివైడ్ టాక్ని సొంతం చేసుకుంది డంకీ. నార్త్‌లో డంకీ సౌండ్ వినిపిస్తోంది కానీ.. సౌత్‌లో మాత్రం డంకీ ఊసే లేదు. మొత్తంగా డంకీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కేవలం 60 నుండి 70 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చిందని అంటున్నారు. అందులో 30 కోట్ల వరకు నెట్ ఉందని సమాచారం. కానీ ఓ రోజు తర్వాత రిలీజ్ అయిన సలార్ మాత్రం మిడ్ నైట్ షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
ఫ్లాఫ్ టాక్‌తోనే వంద కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టే సత్తా ఉన్న ప్రభాస్.. హిట్ టాక్‌తో బాక్సాఫీస్ ర్యాంపేజ్ చేయడం గ్యారెంటీ. ఎంత కాదనుకున్నా 150 కోట్లకు పైగానే సలార్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఉంటాయని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. అంతేకాదు.. సలార్‌కు హిట్ టాక్ ఉంది కాబట్టి.. డే వన్ ఫిగర్ 170 కోట్లకు పైగానే ఉంటుందని అంటున్నారు. దీంతో ప్రభాస్ వర్సెస్ షారుఖ్ క్లాష్‌లో వార్ వన్ సైడ్ అయిపోయిందనే చెప్పాలి. ప్రభాస్‌దే పై చేయి అయ్యింది. మరి ఫైనల్ రన్లో సలార్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.