రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) సలార్(salaar)తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆదిపురుష్(Adipurush)తో విజయం సాధించిన ప్రభాస్ ఇప్పుడు సలార్‌తో రికార్డులు తిరగరాయనున్నాడు. తాజాగా సలార్ నుంచి టీజర్ రిలీజ్(Salaar Teaser Release) అయ్యింది. కేజీఎఫ్ సినిమాతో సినీ ఇండస్ట్రీల చూపును తనవైపు తిప్పుకున్న ప్రశాంత్ నీల్ మరోసారి యాక్షన్ థ్రిల్లర్‌తో విజృంభించనున్నాడు. ఈ రోజు ఉదయమే మేకర్స్ ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు.
సలార్ టీజర్:
రిలీజ్ అయిన టీజర్లో(Salaar Teaser Release) ఒకే ఒక్క డైలాగ్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది. సింహం, చిరుత, పులి, ఏనుగు చాలా ప్రమాదకరమే.. కానీ జురాసిక్ పార్కులో కాదు.. ఎందుకంటే అక్కడ ఉండేది..అంటూ టీజర్ ఎండ్ అవుతుంది. టీజర్ చూసిన తర్వాత ఈ మూవీపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. మూవీలో ప్రభాస్ మాస్ విశ్వరూపం చూపబోతున్నాడని తెలుస్తోంది.
కేజీఎఫ్ మార్కు టేకింగ్ ఉన్న సీన్స్‌తో ప్రభాస్‌ను టీజర్లో(Salaar Teaser Release) చూపించారు. టీజర్ చివర్లో పృథ్వీరాజ్ ను చూపించారు. ఆయన క్యారెక్టర్ కూడా కొత్తగా ఉంది. సలార్: పార్ట్ 1 సీజ్ ఫైర్ సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతిహాసన్, జగపతిబాబు వంటివారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.