Prabhas : 'సలార్'.. ఈ పేరు వింటే చాలు ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తున్నాయి. ప్రశాంత్ నీల్ ఎలివేషన్‌ను ఊహించుకొని.. సెప్టెంబర్ 28 కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
‘సలార్’.. ఈ పేరు వింటే చాలు ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తున్నాయి. ప్రశాంత్ నీల్ ఎలివేషన్‌ను ఊహించుకొని.. సెప్టెంబర్ 28 కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కెజియఫ్ తర్వాత హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. హోంబలే ఫిల్మ్స్ వారు దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో సలార్‌ను నిర్మిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. మళయాళ టాలెంటెడ్ హీరో కమ్ డైరెక్టర్.. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్రభాస్ లుక్ చూసి.. అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక లీక్డ్ లుక్ చూసి ‘సలార్’ను ట్రెండ్ చేస్తునే ఉన్నారు. సాహో, రాధే శ్యామ్‌తో డీలా పడిపోయిన ప్రభాస్ చేతిలో.. ప్రస్తుతం ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె సినిమాలు కూడా ఉన్నాయి. కానీ మోస్ట్ అవైటేడ్ మూవీ మాత్రం సలార్‌నే. అందుకే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కనీవిని ఎరుగని రికార్డులు క్రియేట్ చేయడం గ్యారెంటీ అంటున్నారు. ఇప్పటికే సలార్ రికార్డుల వేట మొదలైపోయింది. తాజాగా ఓ రికార్డును తన పేర లిఖించుకుంది సలార్. రిలీజ్‌కు ఏడు నెలల ముందుగానే.. బుక్‌మై షో యాప్‌లో సలార్ కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటికే బుక్‌మై షోలో ఈ సినిమా కోసం 50 వేల మందికి పైగా ఇంట్రెస్ట్ చూపించడం ఓ రికార్డ్‌గా చెబుతుంటే.. ఇప్పుడు లక్షకి పైగా ఇంట్రెస్ట్ పొందిన సినిమాగా నిలిచిందంటున్నారు. ఈ సినిమా కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో చెప్పడానికి.. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమేనని చెప్పొచ్చు. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత సలార్ రికార్డుల వేటను బాక్సాఫీస్ తట్టుకోవడం కష్టమే.