Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న భారీ ప్రాజెక్ట్స్‌లో 'సలార్' కూడా ఒకటి. ఈ సినిమాను ప్రశాంత్ నీల్.. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాడు. ఊహకందని విధంగా హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నాయి. ప్రభాస్ కెరీర్లోనే ఇది ఊర మాస్ సినిమాగా నిలుస్తుందని నమ్ముతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సలార్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కేజీయఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడం ఒకటైతే.. ప్రభాస్ ఫ్లాపుల్లో ఉండడంతో సలార్ పై లెక్కలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్టే హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. అసలు ఇప్పటి వరకు కనీసం టీజర్ కూడా రాలేదు. అయినా కూడా తమ దాహం తీర్చే సినిమా సలార్ మాత్రమేనని గట్టిగా నమ్ముతున్నారు ప్రభాస్ అభిమానులు. ఇక ఇప్పుడు జేమ్స్ బాండ్ హైప్ సలార్ ఎక్స్‌పెక్టేషన్స్‌ను పీక్స్‌కు తీసుకెళ్లేలా ఉంది. అసలు సలార్ మూవీకి జేమ్స్ బాండ్‌కి ఉన్న సంబంధం ఏంటి.. అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సలార్ షూటింగ్ ఇటలీలోని మటేరాలో జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇది జేమ్స్ బాండ్ మూవీ ‘నో టైమ్ టు డై’ లొకేషన్ స్పాట్. ఇక్కడ జేమ్స్ బాండ్‌కు సంబంధించిన కొన్ని భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించారు. ఇప్పుడు అదే ప్లేస్‌లో సలార్ షూటింగ్ చేస్తున్నట్టు సమాచారం. దాంతో అసలు ప్రశాంత్ నీల్ సలార్‌ను హాలీవుడ్‌కి ఎందుకు తీసుకెళ్లాడనేది.. అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది. మొదట్లో సలార్ మూవీని పాన్ ఇండియా రేంజ్‌లోనే అనుకున్నారు. కానీ ఇప్పుడు హాలీవుడ్ లెవల్లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. పాన్ వరల్డ్ రేంజ్లో ఇంగ్లీష్‌లో కూడా సలార్ రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. అందుకే హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్‌ను డిజైన్ చేసుకున్నాడు ప్రశాంత్ నీల్. ఈ యాక్షన్ సిక్వెన్స్‌ను హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కొరియోగ్రఫి చేస్తున్నారట. మొత్తంగా సెప్టెంబర్ 28న బాక్సాఫీస్ బద్దలు చేసేందుకు రెడీ అవుతున్నాడు ప్రభాస్. మరి హాలీవుడ్ రేంజ్లో వస్తున్న సలార్ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.