Mister Pregnant Full Movie Review In Telugu
మూవీ: మిస్టర్ ప్రెగ్నెంట్
నటీనటులు: సొహైల్, రూపా కొడువయూర్, సుహాసినీ మణిరత్నం, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, అలీ, హర్ష, స్వప్నిక, అభిషేక్ రెడ్డి బొబ్బల తదితరులు
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
ఆర్ట్: గాంధీ నడికుడికర్
సినిమాటోగ్రఫి: నిజార్ షఫీ
సంగీతం: శ్రావణ్ భరద్వాజ్
పీఆర్వో: జీఎస్కే మీడియా
బ్యానర్: మైక్ మూవీక్స్
నిర్మాతలు: అప్పిరెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి
రచన, దర్శకత్వం: శ్రీనివాస్ వింజనంపాటి
విడుదల తేదీ: 18 ఆగస్ట్, 2023
Mister Pregnant: ఓ మగాడు ప్రెగ్నెంట్ అయితే ఎలా ఉంటది..? ఈ సమాజం ఎలా తీసుకుంటుంది..? ఇంతకీ హీరో ఎందుకు ప్రెగ్నెంట్ అవుతాడనే కథతో సినిమా తెరకెక్కించారు. కొత్త కాన్సెప్ట్‌తో.. ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం తీసిన సందేశాత్మక సినిమా మిస్టర్ ప్రెగ్నెంట్ (Mister Pregnant). ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ మూవీ ఎలా తెలుసుకుందాం పదండి.
కథ:
గౌతమ్ (సొహైల్) పేరంట్స్ చిన్నప్పుడే చనిపోతారు. దీంతో అతను ఒంటరిగా పెరుగుతాడు. టాటూ ఆర్టిస్ట్‌గా పనిచేస్తాడు. కెరీర్ పరంగా ఓకే.. అతని వెంట మహి (రూపా కొడవయూర్) అనే అమ్మాయి పడుతుంది. గౌతమ్ అంటే చచ్చేంత ప్రేమ.. ఆమె అంటే గౌతమ్‌కు పెద్దగా ఇష్టం ఉండదు. కాదనలేక ప్రేమని ఒప్పుకొని.. పెళ్లి చేసుకుంటాడు. పెళ్లికి ముందే తనకు పిల్లలు అంటే ఇష్టం ఉండదని.. పిల్లలు వద్దని ఒప్పుకుంటేనే ఓకే చెబుతాడు. అందుకు హీరోయిన్ కూడా అవునని తల ఊపుతుంది. అలా వారి లైఫ్ సాఫీగా సాగుతుంది. ఇంతలో మహి ప్రెగ్నెంట్ అవుతుంది. పిల్లలే వద్దన్న గౌతమ్ ఎలా రియాక్ట్ అయ్యాడు. తర్వాత గౌతమ్ ఎలా ప్రెగ్నెండ్ అయ్యాడనే కథ. కొత్త థీమ్‌తో డైరెక్టర్ మూవీ తీశాడు. ముఖ్యంగా మహిళల కోసం ఈ సినిమా తీశారు. ఆ వర్గం నుంచి ఎక్కువ ఆదరణ లభించే అవకాశం ఉంది.
ఎలా సాగిందంటే..
మిస్టర్ ప్రెగ్నెంట్ (Mister Pregnant) మూవీ ప్రయోగాత్మక మూవీ. ఓ మగాడు గర్భవతి కావడం అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మూవీ రూపొందించారు. మిస్టర్ ప్రెగ్మెంట్ మూవీలో కామెడీ, లవ్, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి. వల్గారిటీకి తావు లేకుండా చక్కగా ఉంది. సెకండాఫ్‌లో బ్రహ్మాజీ ఎపిసోడ్ మూవీని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లింది. తనదైన కామెడీతో నవ్వుల పూయించాడు. యూత్‌కి కావాల్సిన అంశాలు మిస్టర్ ప్రెగ్నెంట్ (Mister Pregnant) మూవీలో ఉన్నాయి. హీరో ప్రెగ్నెంట్‌గా పడే బాధ.. ఎందుకు కావాలని అనుకున్నారనే రహస్యం తెలియడంతో బయటివారి నిందలు, అవమానాలతో హీరో హీరోయిన్లు పడే మానసిక సంఘర్షణ గుండెని బరువెక్కిస్తోంది. ప్రెగ్నెంట్‌గా ఉన్న హీరో.. ఒంటరిగా పడే ఇబ్బందులు కన్నీళ్లు తెప్పిస్తాయి. గర్భవుతుల పడే బాధలను చర్చించడం ఆలోచింపజేస్తాయి. మూవీ చివరి అరగంట ఎమోషనల్ టచ్ ఉంటుంది. అమ్మ తనం గురించి హీరో చెప్పే డైలాగులు గుండెను పిండేస్తాయి.
ఎవరెలా చేశారంటే..?
గౌతమ్ రోల్‌కు హీరో సొహైల్ న్యాయం చేశాడు. మూవీ మొత్తం అతని చుట్టే తిరుగుతోంది. మూడో సినిమా అయిన చక్కగా నటించాడు. ఇది అతనికి కెరీర్లో గుర్తుండిపోయే మూవీగా నిలుస్తోంది. మహి పాత్రలో రూపా చక్కగా నటించి మెప్పించింది. తన పాత్రకు న్యాయం చేసింది. వైవా హర్ష, బ్రహ్మాజీ పరిధి మేరకు నటించారు. గేగా నటించిన సొహైల్ ఫ్రెండ్ పాత్ర కూడా బాగుంది. సుహాసిని మణిరత్నం డాక్టర్‌గా జీవించారు. రాజా రవీంద్ర, మిగిలిన ఆర్టిస్టులు తమ పరిధి మేరకు నటించి.. ఆకట్టుకున్నారు.
టెక్నికల్ వ్యాల్యూస్
ప్రయోగాత్మక సినిమాలకు అన్ని అంశాల సెట్ కావు. దర్శకుడు శ్రీనివాస్‌కి ఇది ఫస్ట్ ఫిల్మ్.. అయినప్పటికీ చక్కగా మూవీని తెరకెక్కించాడు. రిస్క్ సబ్జెక్ట్‌ను చక్కగా తీశాడు. కథని నడిపించిన తీరు ఆకట్టుకుంది. నిజార్ షఫీ కెమెరా పనితరం మూవీకి మంచి హైప్ తీసుకొచ్చింది. ప్రతీ ఫ్రేమ్ రిచ్‌గా, కలర్ఫుల్గా తీశాడు. విజువల్స్ చూడముచ్చటగా ఉన్నాయి. శ్రావణ్ భరద్వాజ్ మ్యూజిక్ వినసొంపుగా ఉంది. బీజీఎం, సాంగ్స్ అదరగొట్టాయి. ఆర్ఆర్ కూడా అదిరింది. సినిమాకు కెమెరా, మ్యూజిక్ రెండు పిల్లర్లుగా మారాయి. ప్రయోగాత్మక మూవీని నిర్మించిన నిర్మాత అప్పిరెడ్డి గట్స్‌కు అభినందించాల్సిందే.. రాజీపడకుండా మూవీని నిర్మించారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా రిచ్‌గా ఉన్నాయి.
ఫైనల్‌గా..
మిస్టర్ ప్రెగ్నెంట్ (Mister Pregnant) ఫస్ట్ హాఫ్‌లో మరింత కేర్ తీసుకోవాల్సింది. లవ్ స్టోరీని ఇంకా ఫీల్ వచ్చేలా చెబితే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గౌతమ్‌ని మహి అంతగా ప్రేమించడానికి గల కారణం మరింత బలంగా చెబితే బాగుండేది. ఫస్ట్ హాఫ్ రెగ్యులర్‌గా అనిపిస్తోంది. కామెడీకి స్కోప్ ఉన్న ఆ దిశగా ప్రయత్నం చేయలేదు. వినోదం పెంచితే బాగుండేది. హీరో తాను ప్రెగ్నెంట్ కావాలని అనుకునే విధానాన్ని మరింత బలంగా చెబితే బాగుండేది. ప్రెగ్నెంట్ టైమ్, డెలివరీ టైమ్‌లో ఆడవాళ్లు పడే బాధను మరింత బలంగా చూపించాల్సి ఉంది. ఇలాంటి కథతో సినిమా తీయడం కత్తి మీద సాము.. దానిని కొత్త డైరెక్టర్ అయినా సరే కన్విన్సింగ్‌గా తెరకెక్కించాడు. కథలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా.. క్లారిటీగా మూవీని తీసి.. సక్సెస్ అయ్యాడు.
ప్లస్
+సొహైల్ నటన
+దర్శకుడు శ్రీనివాస్ టేకింగ్
+మ్యూజిక్, కెమెరా పనితనం
+బ్రహ్మజీ కామెడీ
మైనస్
-సాగదీతగా ఫస్ట్ హాఫ్
– ఫస్ట్ హాఫ్‌లో కామెడీ లేకపోవడం మైనస్
రేటింగ్: 2.5/ 5