SKLM: ధాన్యం సేకరణకు ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో ముందుకెళ్తున్న నేపథ్యంల, రైస్ మిల్లర్లు ముందస్తుగా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. 48 గంటల్లోగా బ్యాంకు గ్యారంటీ సమర్పించని మిల్లులకు ధాన్యం అలాట్ మెంట్ నిలిపివేస్తామని హెచ్చరించారు. మంగళవారం జడ్పీ సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లతో ఆయన సమావేశం నిర్వహించారు.