Tiger NageswaraRao: హిట్ ప్లాప్(flop) లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటారు రవితేజ(Raviteja). వరుస ప్లాపులు వచ్చిన సాలీడ్ హిట్ రాగానే బౌన్స్ బ్యాక్ అవుతుంటాడు. రవితేజ తాజా చిత్రం రావణాసుర(Ravanasura) ప్లాప్ అయింది. మాస్ మహారాజా ప్రస్తుతం `టైగర్ నాగేశ్వరరావు` మూవీతో బిజీగా ఉన్నాడు. వంశీకృష్ణ నాయుడు(Vamshi krishna naidu) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్(Abhishek agarwal) నిర్మిస్తున్నారు. రవితేజ సరసన నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్(pawan kalyan) మాజీ భార్య రేణు దేశాయ్(Renudesai) ఇందులో ఓ కీలక పాత్రను పోషించింది.
టైగర్ జోన్ గా పేరుగాంచిన స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా ఈ చిత్రం రూపొందుతుంది. లైఫ్ స్టొరీతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్ 20న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.రవితేజ నటిస్తున్న తొలి పాన్ ఇండియా(Pan india) సినిమా ఇది. పైగా మాస్ రాజా కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం రూ. 50 కోట్లు ఖర్చు పెడుతున్నారట నిర్మాతలు. ఈ విషంలోనూ రాజీ పడకుండా టైగర్ నాగేశ్వరరావును రూపొందిస్తున్నారట. మరి `రావణాసుర` మూవీతో ఫ్లాప్‌ను మూటగట్టుకున్న రవితేజ.. ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా..లేదా.. అన్నది చూడాలి.