»Rashmikas Video Is Viral I Support That Ipl Team I Like That Cricketer
Rasmika: రష్మిక వీడియో వైరల్.. ఆ IPL టీమ్‌కే నా సపోర్ట్, ఆ క్రికేటర్ అంటే ఇష్టం!
ప్రస్తుతం సోషల్ మీడియా.. విరాట్ కోహ్లీ వర్సెస్ గౌతమ్ గంభీర్ అంటూ హోరెత్తిపోతోంది. ఈ ఇద్దరి మధ్య జరిగిన వాగ్వివాదం వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూపై బెంగళూరు టీమ్ విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య వివాదం చెలరేగింది. ఇదే సమయంలో రష్మిక మందన్న తన ఫేవరేట్ క్రికేటర్ అండ్ ఐపీఎల్ టీమ్ గురించి చెప్పిన వీడియో కూడా వైరల్ అవుతోంది.
నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక(Rasmika).. పుష్ప సినిమా(Pushpa Movie)తో పాన్ ఇండియా బ్యూటీగా మారిపోయింది. ముఖ్యంగా ఆ సినిమాలో సామి.. సామి.. అంటూ రష్మిక చేసిన స్టెప్పులు ఇప్పటికీ వైరలే. అయితే ఒక్క సినిమాలే కాదు.. ఐపీఎల్(IPL)లోను హంగామా చేస్తోంది. ఇప్పటికే ఐపీఎల్ సీజన్ ఓపెనింగ్‌లో రష్మిక మందన పుష్ప, ఆర్ఆర్ఆర్ పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేసి దుమ్ములేపింది. తాజాగా ‘స్టార్ స్పోర్ట్స్’ ఛానల్‌కి ఇంటర్వ్యూలో.. రష్మిక తనకు ఇష్టమైన క్రికెట్ జట్టుతో పాటు క్రికెటర్ గురించి చెప్పుకొచ్చింది. ఒక బెంగళూరు అమ్మాయిగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టునే తన ఫేవరేట్ అని.. ఈ సాలా కప్ నమ్దే అంటూ స్లోగన్ కూడా చెప్పింది. ఖచ్చితంగా ఈసారి ‘ఆర్సిబి’ (RCB) ఫైనల్‌కి వెళ్తుందని చెప్పుకొచ్చింది. ఇక తన ఫేవరేట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) సర్ అని చెప్పింది. కోహ్లీ దూకుడు, బ్యాటింగ్ శైలి తనకిష్టమని చెప్పుకొచ్చింది. ఇకపోతే.. ప్రస్తుతం రష్మిక పుష్ప2(Pushpa2), యానిమల్ వంటి పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తోంది. అలాగే నితిన్ సరసన ఓ సినిమా, రెయిన్బో అనే సినిమా కూడా చేస్తోంది. ఏదేమైనా.. సినిమాలతో పాటు ఐపీఎల్తోను రచ్చ చేస్తోంది రష్మిక.
రష్మిక వీడియో:
.@iamRashmika reveals her RCB FAN-GIRL side. 🙈💓 From being a die-hard @ImVkohli fan to chanting ‘Ee Sala Cup Namde’, she is a TOTAL RCBian! 🤩