Rana Daggubati: సమంత ఆరోగ్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రానా
బాహుబలి(Bahubali) సినిమా ద్వారా పాన్ ఇండియాలో లెవల్లో క్రేజ్ తెచ్చుకున్న వారిలో హీరో రానా దగ్గుబాటి(Rana Daggubati) కూడా ఉన్నారు. హీరో రానా హీరోయిజం కాకుండా కంటెంట్ ప్రాధాన్యతను బట్టి సినిమాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. తన నటనతో ప్రత్యేక ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకున్నాడు. హీరోను ఢీకొట్టే ప్రతినాయకుడిగానూ మెప్పించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. ప్రస్తుతం రానా నాయుడు(Rana Naidu) అనే వెబ్ సిరీస్(Web Series)లో రానా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ లో విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) సైతం కీలక పాత్రలో కనిపించనున్నారు.

రానా నాయుడు(Rana Naidu) వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్(Netflix)లో మార్చి 10వ తేది నుంచి స్ట్రీమింగ్ కానుంది. అమెరికన్ టీవీ సిరీస్ రే డొనోవన్ కు రీమేక్ గా ఇది తెరకెక్కుతోంది. ఈ వెబ్ సిరీస్ ను అన్షుమాన్, సుపర్ణ్ వర్మ సంయుక్తంగా రూపొందిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా రానా(Rana) పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ వస్తున్నారు. ఈ సందర్భంగా రానా పలు విషయాలను తెలియజేస్తున్నాడు. హీరోయిన్ సమంత(Samantha) ఆరోగ్యం గురించి కూడా రానా ఈ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం రానా(Rana) కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సమంత(Samantha) ఆరోగ్య పరిస్థితి తెలియగానే ఆమెను సంప్రదించినట్లు రానా(Rana) తెలిపారు. సమంతతో తాను ఎప్పుడూ ఫోన్లలో మాట్లాడుతుంటానని, ఇద్దరం ఒకరి బాధలు మరొకరు చెప్పుకుంటామన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలనేవి కచ్చితంగా ఉంటాయని, ఎవరి జీవితం సాఫీగా ఉండదని, కానీ ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చేది ఒకటేనని అదే ఆరోగ్య సమస్య అని రానా(Rana) చెప్పుకొచ్చారు.
ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు అందరూ విచారంగా కూర్చుని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఆత్మవిశ్వాసంతో తిరిగి లేచి ముందుకు సాగడమే జీవితమని రానా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రానా(Rana) మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతున్నాయి. రానా నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు(Rana Naidu) మార్చి 10వ తేదిన స్ట్రీమింగ్ కానుంది.