దగ్గుబాటి రానా ప్రస్తుతం ఏం చేస్తున్నాడు.. ఏ సినిమా చేయబోతున్నాడు.. డైరెక్టర్ ఎవరు.. ఎలాంటి సబ్జెక్ట్‌తో రాబోతున్నాడు.. అనే విషయాల్లో క్లారిటీ లేదు. అయితే తాజాగా ‘హిరణ్యకశ్యప’కు రంగం సిద్దమైనట్టు తెలుస్తోంది. ఈ ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు రానా. వాటిలో భీమ్లా నాయక్, విరాట పర్వం సినిమాలతో అలరించగా.. 1945 అనే సినిమా ఎప్పుడొచ్చిందో కూడా తెలియకుండా పోయింది. ఇక విరాట పర్వం తర్వాత రూట్ మారుస్తానని.. కమర్షియల్ చేస్తానని చెప్పుకొచ్చాడు రానా. అయితే ఇప్పటి వరకు రానా నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి అప్డేట్ లేదు. ప్రస్తుతం బాబాయి వెంకటేష్‌తో కలిసి నటించిన ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ మాత్రమే రానా చేతిలో ఉంది.
అయితే గతంలో దర్శకుడు గుణశేఖర్.. రానాతో ‘హిరణ్యకశ్యప’ అనే ఓ భారీ ఫాంటసీ మూవీ చేయాలనుకున్న సంగతి తెలిసిందే. గుణశేఖర్ తెరకెక్కించిన ‘రుద్రమ దేవి’లో కీలక పాత్రలో నటించాడు రానా. దాంతో అప్పుడే ‘హిరణ్యకశ్యప’ చేయాలనుకున్నారు. కానీ ఇప్పటి వరకు దీని గురించి ఎలాంటి అప్డేట్ లేదు. అయితే తాజాగా గుణశేఖర్ దీని పై ఓ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం సమంత లీడ్ రోల్లో ‘శాకుంతలం’ అనే మైథలాజికల్ సినిమా తెరకెక్కిస్తున్నాడు గుణ శేఖర్. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఇదే విషయాన్ని చెబుతూ.. త్వరలోనే ప్రమోషన్స్‌తో అందరిని కలవబోతున్నానని చెప్పుకొచ్చాడు గుణశేఖర్. ఈ సందర్భంగా నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘హిరణ్యకశ్యప’ని మాసివ్ స్కేల్లో భారీగా ప్లాన్ చేస్తున్నట్టు తెలిపాడు. అయితే ఈ సినిమా రానాతో వుంటుందా.. లేదా అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. కానీ రానాతోనే ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.