»Ram Charan Sukumar Big Announcement This Time It Will Not Be Usual
Ram Charan: రామ్ చరణ్, సుకుమార్ బిగ్ అనౌన్స్.. ఈసారి మామూలుగా ఉండదు!
గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ.. రంగస్థలం కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ.. రామ్ చరణ్, సుకుమార్ దర్శకత్వంలో బిగ్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ సారి రంగస్థలంకు మించి ఉంటుందని చెబుతున్నారు మేకర్స్.
Ram Charan, Sukumar Big Announcement.. This time it will not be usual!
Ram Charan: రంగస్థలం కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ.. మార్చి 27న చరణ్ బర్త్ డే సందర్బంగా సుకుమార్, చరణ్ సినిమా ప్రకటన ఉంటుదని జోరుగా ప్రచారం జరిగింది. దీంతో.. ఆర్సీ 17 హ్యాష్ ట్యాగ్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. దీంతో అనౌన్స్మెంట్తోనే ఈ సినిమా పై అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి. చరణ్ కెరీర్లో రంగస్థలం ఓ మైల్ స్టోన్‌లా నిలిచిపోయింది. దీంతో ఈసారి సుకుమార్, చరణ్‌ను ఎలా ప్రజెంట్ చేస్తాడనేది ఎగ్జైటింగ్‌గా మారింది. దీనికి తోడు.. ఇప్పటికే సుకుమార్ ఎంట్రీ సీక్వెన్స్ షూట్ చేశాడని.. ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్‌లో రాజమౌళి చెప్పడం ఆర్సీ 17ని ఆకాశానికెత్తేసేలా చేసింది. ఖచ్చితంగా అనౌన్స్మెంట్తోనే ఆర్సీ 17 సెన్సేషన్ క్రియేట్ చేయడం గ్యారెంటీ అనుకున్నారు.
అయితే.. చరణ్ బర్త్ డేకి రెండు రోజులు ముందే బిగ్ అనౌన్స్ ఇచ్చారు మేకర్స్. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నట్టుగా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించబోతున్నట్లు కూడా అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా గుర్రాలు రేసుకు సిద్ధమవుతున్నట్లుగా ఉన్న ఒక ఫోటోని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ పై రేరింగ్ టు కాంక్వర్ అని రాసుకొచ్చారు. దీని అర్థం.. ఆక్రమించడానికి రంగంలోకి దిగుతున్నామని. ఈ ఏడాది చివరి నుంచి ఈ సినిమా పనులు స్టార్ట్ కానున్నాయి. 2025 చివర్లో గ్రాండ్‌గా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రంగస్థలం తర్వాత రామ్ చరణ్, సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్, డీఎస్పీ కాంబినేషన్లో రెండో సినిమా ఇది. పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ప్రస్తుతానికి రామ్ చరణ్, గేమ్ చేంజెర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత ఆర్సీ 17 కంప్లీట్ చేయనున్నాడు. సుకుమార్ పుష్ప2తో బిజీగా ఉన్నాడు. ఆగష్టు 15న పుష్ప2 రిలీజ్ కానుంది. ఆ తర్వాత ఆర్సీ 17 సెట్స్ పైకి వెళ్లనుంది.