మనిషి ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నా.. ఎక్కడి నుంచి వచ్చామనేది గుర్తుంచుకోవాలని అంటారు! రజనీకాంత్ (Rajinikanth) అదే పనిచేశారు. ఒకనాటి తన జ్ఞాపకాల బాట పట్టిన సూపర్‌స్టార్.. తాను మొదట్లో బస్ కండక్టర్(Bus conductor)గా పనిచేసిన జయనగర్ బస్టాండ్‌కు వెళ్లారు..అనుకోని అతిథి కనిపించేసరికి అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యానందాలకు గురయ్యారు. కొద్దిసేపు అక్కడే డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందితో ముచ్చటించిన 72 ఏళ్ల సూపర్‌స్టార్(Superstar).. అందరికీ గత కాలపు మొమరీస్ గుర్తుచేసుకుని ఆనందం పంచారు. రజినీ కాంత్ తన సింప్లిసిటీని మరోసారి చాటుకున్నారు. కోట్ల మంది అభిమానులు కలిగి, కోలీవుడ్ (Kollywood) ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతూ రజినీ కాంత్ ఎంత సింపుల్ గా ఉంటారో చాలా మందికి తెలిసిందే. ఆయన వ్యక్తిత్వానికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు.
సూపర్ స్టార్ డమ్, కోట్లకు అధిపతి అయినప్పటికీ ఆయన చాలా సింపుల్ గా ఉండేందుకే ఇష్టపడతారు. ఎక్కడికి వెళ్లినా పెద్దగా హడావుడి లేకుండా సామాన్యుడిలా ఉండటానికే ప్రయత్నిస్తారు. అందుకే ఆయన అంటే అభిమానులకు చచ్చేంత ఇష్టం. అలాంటి రజినీ కాంత్ తన సింప్లిసిటిని మరోసారి చాటుకున్నారు. సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dilip Kumar) దర్శకత్వంలో వచ్చిన మూవీ జైలర్ సూపర్ డూపర్ హిట్ కావడంతో.. ఆ మూవీ సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు రజినీ కాంత్. ఇప్పటి హీరో రజనీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. తమిళ సినీ దర్శక దిగ్గజం కే బాలచందర్(Balachander)ఆయనను గుర్తించి, 1975లో అబూర్వ రగన్గళ్ సినిమాలో అవకాశం ఇచ్చేదాకా ‘శివాజీరావ్ గైక్వాడ్’ బెంగళూరులో బస్‌కండక్టర్(Bus conductor)గా పనిచేశారు. ఆ సినిమాలో కమల్‌హాసన్ కూడా నటించారు.
WATCH | During an surprise visit, the renowned actor @rajinikanth engaged in a delightful conversation with the BMTC crew. The superstar graciously posed for selfies with BMTC crew. pic.twitter.com/z5IePKeLGJ