Surya 42 : సౌత్ సినిమాలకు పాన్ ఇండియా మార్కెట్ సెట్ చేసిన జక్కన్న దారిలోనే.. ఇప్పుడు బిగ్ స్కేల్ మూవీస్ తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాల్లో.. చాలా వరకు రాజమౌళినే ఫాలో అవుతున్నాయి. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కూడా రాజమౌళి వల్లే పొన్నియన్ సెల్వన్ సాధ్యమైందని చెప్పుకొచ్చారు.
సౌత్ సినిమాలకు పాన్ ఇండియా మార్కెట్ సెట్ చేసిన జక్కన్న దారిలోనే.. ఇప్పుడు బిగ్ స్కేల్ మూవీస్ తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాల్లో.. చాలా వరకు రాజమౌళినే ఫాలో అవుతున్నాయి. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కూడా రాజమౌళి వల్లే పొన్నియన్ సెల్వన్ సాధ్యమైందని చెప్పుకొచ్చారు. ఈ లెక్కన రాజమౌళిని కొట్టేయాలనే ఆలోచనతోనే చాలా మంది స్టార్ హీరోలు, డైరెక్టర్స్ సినిమాలు చేస్తున్నారు. స్టార్ హీరో సూర్య నుంచి ఏకంగా బాహుబలి రేంజ్ సినిమా వస్తుందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సూర్య 42 వర్కింగ్ టైటిల్‌తో భారీ పీరియాడిక్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు సూర్య. ఏకంగా పది భాషల్లో ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. దిశాపటానీ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా టైటిల్ ఏప్రిల్ 16 ఉదయం 9:05 గంటలకు రానుందని.. ఒక కొత్త లుక్‌తో రివీల్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రీ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కానీ ఈ పోస్టర్ చూసిన తర్వాత బాహుబలినా? మగధీరనా? అనే డౌట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ పోస్టర్ మగధీర సినిమాలోని క్లైమాక్స్‌ను గుర్తు చేస్తోంది. మైటీ వారియర్ ఉరుములు, మెరుపుల మధ్య కదనరంగంలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు చూపించారు. దీంతో సూర్య 42 పోస్టర్ చూడగానే మగధీర బ్రిడ్జి బ్లాస్టింగ్ సీన్ మైండ్‌లో రన్ అయిపోతుంది. అలాగే రాజుల కాలం నాటి బ్యాక్ డ్రాప్ కావడంతో.. ఈ సినిమా పై బాహుబలి ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. అయితే పొన్నియన్ సెల్వన్ రిలీజ్ అయినప్పుడు కూడా బాహుబలి రేంజ్ అన్నారు. కానీ తీరా థియేటర్లోకి వచ్చాక.. తమిళ్‌తో తప్పితే మరో చోట ఈ సినిమా ఆడలేదు. దీంతో సూర్య ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. మరి ఈ రెండు సినిమాలతో సూర్య 42ని పోలుస్తున్నారు కాబట్టి.. టైటిల్ అండ్ ఫస్ట్ లుక్‌తో ఎలా ఇంప్రెస్ చేస్తారనేది వేచి చూడాల్సిందే.