»Pushpa 2 Is He Out Of Pushpa 2 National Award Winner In The Field
Pushpa 2: ‘పుష్ప 2’ నుంచి అతను అవుట్? రంగంలోకి నేషనల్ అవార్డు విన్నర్?
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'పుష్ప: ది రూల్'. అయితే.. ఈ సినిమా రిలీజ్‌కు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉండగా.. ఓ కీలక టెక్నీషియన్ తప్పుకున్నట్టుగా సమాచారం.
Pushpa 2: Is he out of 'Pushpa 2'? National award winner in the field?
Pushpa 2: స్టార్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న పుష్ప2 చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండేళ్ల కిందట వచ్చిన ‘పుష్ప పార్ట్- 1’ సంచలన విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచే సీక్వెల్ పై ఆసక్తి నెలకొంది. అంచనాలకు తగ్గట్టుగా.. ఏ మాత్రం కాంప్రమైజ్ అవకుండా పుష్ప2 తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అంటే రిలీజ్‌కు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.
ఓవైపు షూటింగ్, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో పుష్ప2 నుంచి టాప్ టెక్నీషియన్ వెళ్లిపోయాడనే ప్రచారం జరుగుతోంది. వేరే కమిట్టెంట్స్ కారణంగా పుష్ప 2 ఎడిటర్ ఆంటోనీ రూబెన్ ఈ చిత్రం నుండి తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఈయన పుష్ప పార్ట్ 1కి కూడా వర్క్ చేశాడు. కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ టైం దగ్గర పడుతున్న సమయంలో.. బయటకు వెళ్లిపోయాడని అంటున్నారు. దీంతో.. సుకుమార్ ఏ మాత్రం లేట్ చేయకుండా మరో ఎడిటర్‌ను రంగంలోకి దింపినట్టుగా తెలుస్తోంది.
ఆంటోని రూబెన్ ప్లేస్‌ను జాతీయ అవార్డు విన్నర్ నవీన్ నూలితో రీప్లేస్ చేసినట్టుగా సమాచారం. అయితే.. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. కానీ ఇప్పటికే చాలా భాగం ఎడిటింగ్ అయ్యిపోయిందని అంటున్నారు. కాబట్టి ఇలాంటి కీలక మార్పు వల్ల పుష్ప2 పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఏదేమైనా.. ఈసారి మాత్రం పుష్పరాజ్ గట్టిగా కొట్టడం గ్యారెంటీ.