పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పారితోషికం వంద కోట్లకు పైగానే ఉంటుంది. కానీ కల్కి 2898ఏడి సినిమా కోసం భారీగా పెంచినట్టుగా తెలుస్తోంది. సినిమా బడ్జెట్లో రెమ్యునరేషనే సగం ఉంటుందని అంటున్నారు. ఇంతకీ ప్రభాస్ ఎంత తీసుకుంటున్నాడు?
Prabhas: బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన ప్రభాస్.. ఒక్కో సినిమాకు వంద కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. అయితే.. కల్కి సినిమాకు ప్రభాస్ పారితోషికం ఎంత? అనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ సినిమాకు ప్రభాస్ భారీగా పెంచినట్టుగా చెబుతున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీ దత్ దాదాపు 600 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో 25 శాతం ప్రభాస్ రెమ్యునరేషన్‌కే పోతుందని తెలుస్తోంది. ఈ లెక్కన 150 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడు ప్రభాస్. గత చిత్రాలకు 120 కోట్లకు పైగా అందుకున్న డార్లింగ్.. ఇప్పుడు ఏకంగా 150 కోట్లకు పెంచేశాడని సమాచారం.
అంతేకాదు.. కల్కి బడ్జెట్లో 250 నుంచి 300 కోట్ల వరకు కేవలం స్టార్ రెమ్యూనరేషన్‌కు ఖర్చు అవుతుందని అంటున్నారు. ఈ సినిమాలో దీపిక పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌కు చెరో 20 కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీపికా పదుకొనెకు 10 కోట్లు, దిశా పటానీ 5 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. మొత్తం బడ్జెట్లో స్టార్ కాస్ట్ రెమ్యునరేషన్‌కే సగం బడ్జెట్ వెళ్తుందని చెప్పొచ్చు. ఇకపోతే.. మే 9న రావాల్సిన కల్కి పోస్ట్ పోన్ అయింది. కానీ ఇంకా కొత్త రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్. మే ఫస్ట్ వీక్‌లో కొత్త డేట్ అనౌన్స్మెంట్ ఉండే ఛాన్స్ ఉంది. బహుశా జూన్ ఎండింగ్లో కల్కి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏదేమైనా.. కల్కి పై మాత్రం భారీ అంచనాలున్నాయి.