కుటుంబసభ్యులు ఎవరైనా చనిపోతే ఆ ఇంట్లోని వారంతా బాధలో ఉంటారు. నిజానికి ఆ సమయంలో వారు ఏ విషయం గురించి కూడా ఆలోచించరు. ఆ బాధలో ఉంటారు. అయితే.. లోపల ఎంత బాధ ఉన్నా… హీరో ప్రభాస్ మాత్రం.. తన పెదనాన్న పార్థివ దేహాన్ని చూడటానికి వచ్చిన అభిమానులను మర్చిపోలేదు. తమ కుటుంబ అతిథి మర్యాదలను మర్చిపోలేదు.
కృష్ణంరాజు అంతిమయాత్రకు హాజరైన అభిమానుల కోసం ప్రభాస్ భోజనాలు ఏర్పాటు చేయించాడు. దీంతో అక్కడికి వచ్చిన అభిమానులందరినీ భోజనం చేసి వెళ్లమని కోరాడు. అయితే ఈ విషయాన్ని ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రభాస్ అభిమానులతో మాట్లాడుతున్న వీడియోని షేర్ చేశారు. పెదనాన్న పోయిన బాధలో ఉన్న ప్రభాస్ అంతటి బాధలో కూడా తన అభిమానుల గురించి ఆలోచించటంతో ప్రభాస్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రభాస్ తన అభిమానులతో మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
ప్రభాస్ ఎప్పుడు అందరికీ కడుపునిండా భోజనం పెడుతూ ఉంటాడు. షూటింగ్ సమయంలో కూడా తన ఇంటి నుండి భోజనం తెప్పించి మరి సెట్ లో ఉన్న అందరికీ రుచికరమైన భోజనాలు వడ్డిస్తాడు. అయితే ఈ అలవాటును కృష్ణంరాజు నుండి ప్రభాస్ నేర్చుకున్నాడు. కృష్ణంరాజు కూడా ఎప్పుడు తన ఇంటికి వచ్చిన వారికి అతిధి మర్యాదలు చేసి కడుపునిండా భోజనం పెట్టి పంపుతుంటాడు. దీంతో కృష్ణంరాజు పేరు మర్యాద రామన్నగా మారిపోయింది. ఇలా ప్రభాస్ కూడా తన పెదనాన్న లాగే ఆలోచించడంతో అందరూ ఈయనపై ప్రశంసల కురిపిస్తున్నారు.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెడుతునే ఉన్నాడు ప్రభాస్. రెండు మూడు సినిమాలు సెట్స్ పై ఉండగానే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లాక్ చేస్తున్నాడు. సలార్, కల్కి, మారుతి ప్రాజెక్ట్, స్పిరిట్ తర్వాత ప్యూర్ లవ్ స్టోరీ చేయబోతున్నాడు ప్రభాస్. తాజాగా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ లాక్ అయినట్టుగా తెలుస్తోంది.