బాహుబలి మూవీ తర్వాత ప్రభాస్ క్రేజ్ పీక్స్‌కు చేరింది. ఆ మూవీ తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా ప్రభాస్ మారిపోయాడు. నార్త్ ఇండస్ట్రీలో డార్లింగ్ ప్రభాస్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. బాహుబలి మూవీ తర్వాత ప్రభాస్ నంటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇప్పుడు సలార్ సినిమా పైనే అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
1st Pic: Eluru 2nd Pic Bhimavaram Natraj Theatre
Never Before Celebrations Loading In Telugu States
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సలార్ మూవీ భారీ అంచనాలను అందుకుంది. కేజీఎఫ్ మూవీస్ నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మించడం విశేషం. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పోస్టర్స్, టీజర్ వంటివి మూవీపై హైప్‌ను క్రియేట్ చేశాయి. ఈ మధ్యనే విడుదలైన ట్రైలర్ ఈ మూవీపై మరింత క్యూరియాసిటీని పెంచేసింది. డిసెంబర్ 22వ తేదిన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ముంబైలో ఫ్యాన్స్ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు.
ముంబైలోని హార్ట్ ల్యాండ్‌లో దాదాపు 120 అడుగుల ప్రభాస్ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే అతి పెద్ద కటౌట్ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అని సినీ ప్రియులు చెబుతున్నారు. గతంలో కేజీఎఫ్2 కోసం 100 అడుగుల యష్ కటౌట్ ఏర్పాటు చేయగా ఇప్పుడు 120 అడుగుల కటౌట్ ఏర్పాటు చేసి రికార్డును క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.