Prabhas: భైరవగా ప్రభాస్.. కల్కి కొత్త పోస్టర్ వైరల్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం కల్కి 2898 ఏడీ. మహాశివరాత్రి కానుకగా మూవీ నుంచి ప్రభాస్ క్యారెక్టర్‌ను రివీల్ చేశారు మేకర్స్. భైరవను పరిచయం చేస్తూ విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), దర్శకుడు నాగ్ అశ్విన్(Nag Ashwin) కాంబినేషన్లో వస్తున్నా సైంటిఫిక్ థ్రిల్లర్ కల్కి 2898(Kalki2898AD) ఏడీ. హాలీవుడ్ రేంజిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటానీ వంటి దిగ్గజాలు నటిస్తున్నారు. తాజాగా మహాశివరాత్రి కానుకగా మూవీ నుంచి ప్రభాస్ క్యారెక్టర్‌ను రివీల్ చేశారు మేకర్స్. భైరవ(Bhairava)ను పరిచయం చేస్తూ విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా మే 9న విడుదలకు సిద్ధం అయింది.
భారతీయ పురాతన ఇతిహాసం మహాభారతం కాలం నుంచి ప్రారంభమై 2898 సంవత్సరంతో పూర్తయ్యే స్టోరీ అని డైరెక్టర్ చెప్పారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన దీని గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. అయితే తాజాగా ప్రభాస్ పోస్టర్ కూడా ఫ్యాన్స్‌కు విపరీతంగా నచ్చింది. కాశీ భవిష్యత్తు వీధుల నుంచి భైరవని పరిచయం చేస్తున్నాం అంటూ మేకర్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. స్లీవ్ లెస్ డ్రెస్‌లో కండలు తిరిగిని దేహంపై టాటుతో, పోనీ టైల్ హెయిర్ స్టైలిష్‌తో వేరే లెవల్ల్లో కనిపించారు.