Vijayadevarakonda: మరోసారి ‘జనగణమన’ జోడీ.. ఈసారైనా వర్కౌట్ అయ్యేనా!?
పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన 'లైగర్' సినిమా.. ఎంత పెద్ద డిజాస్టర్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమా వివాదం కొనసాగుతునే ఉంది. ఈ సినిమా ఫ్లాప్ ఎఫెక్ట్ పూరి పై కాస్త గట్టిగానే పడింది. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ మాత్రం అటకెక్కింది. దాంతో విజయ్, పూజా హెగ్డే ఇక కలిసి నటించరు అనుకున్నారు. కానీ తాజాగా మరోసారి ఈ జోడి రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతోంది.
లైగర్(Liger Movie) దెబ్బతో మళ్లీ రామ్ పోతినేని(Ram Pothineni)నే నమ్ముకున్నాడు పూరి జగన్నాథ్(purijagannadh). ఇస్మార్ట్ శంకర్(Ismart shankar) సీక్వెల్‌తో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. కానీ పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ మాత్రం అటకెక్కింది. లైగర్ మూవీ రిలీజ్‌కు ముందే విజయ్ దేవరకొండతో ‘జనగణమన’ను గ్రాండ్‌గా లాంచ్ చేశాడు పూరి. ఒకటి అర షెడ్యూల్ షూటింగ్ కూడా జరుపుకుంది. ఈ సినిమాలో రౌడీ సరసన హీరోయిన్గా పూజా హెగ్డేను తీసుకున్నారు. కానీ లైగర్ దెబ్బకు పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇక విజయ్, పూజా హెగ్డే కలిసి నటించే అవకాశం లేదనుకున్నారు. కానీ మరోసారి జనగణమన జోడి ఫిక్స్ అయిపోయినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఖుషి సినిమాతో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరితో కమిట్ అయ్యాడు. ఇక ఈ సినిమా తర్వాత దిల్ రాజు బ్యానర్లో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు రౌడీ. గీతా గోవిందంతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు పరశురామ్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డేని లాక్ చేసినట్టు వినిపిస్తోంది. అయితే గీతా గోవిందం కాంబినేషన్ కావడంతో.. మరోసారి రష్మికనే హీరోయిన్గా తీసుకునే ఛాన్స్ ఉందని అన్నారు.
అంతేకాదు.. ఈ సినిమా గీతా గోవిందం సీక్వెల్ అనే టాక్ కూడా నడుస్తోంది. కానీ ఇప్పుడు రష్మిక ప్లేస్‌లో ఇప్పుడు పూజా వచ్చి చేరిందని అంటున్నారు. దీంతో ఈసారైనా జనగణమన జోడి వర్కౌట్ అవుతుందో లేదో.. అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పూజా హెగ్డే.. మహేష్ బాబు సరసన ‘గుంటూరు కారం’ చిత్రంలో నటిస్తోంది. పవన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’లోను ఆఫర్ అందుకున్నట్టు సమాచారం.