Pooja Hegde: అమితాబ్‌తో పూజా హెగ్డే.. మహేష్ సినిమా నుంచి ఔట్!
తెలుగులో హాట్ బ్యూటీ పూజా హెగ్డే కెరీర్ దాదాపుగా క్లోజ్ అయినట్టే. ప్రస్తుతం అమ్మడి చేతిలో మహేష్ బాబు 'గుంటూరు కారం' సినిమా మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి పూజా తప్పుకున్నట్టు దాదాపుగా కన్ఫర్మేషన్ వచ్చేసినట్టే. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటో ఒకటి.. బాలీవుడ్ పైనే ఫోకస్ చేసినట్టుగా ఉంది.
అతడు, ఖలేజా సినిమాల తర్వాత త్రివిక్రమ్, మహేష్ బాబు(Mahesh Babu) కాంబినేషన్లో వస్తున్న ‘గుంటూరు కారం’ (Guntur Karam)పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో పూజా హెగ్డే(Pooja Hegde), శ్రీలీలను హీరోయిన్లుగా తీసుకున్నారు. పూజా హెగ్డే పై కొన్ని సీన్స్ కూడా షూట్ చేశారు. ఇంత జరిగిన తర్వాత.. మధ్యలో పూజా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం ఏంటి? అనే డౌట్స్ వచ్చాయి. కానీ తాజాగా ఈ వార్తల పై పూజా హెగ్డే టీం క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. పూజా ‘గుంటూరు కారం’ నుంచి ఔట్ అయిందనే న్యూస్.. నిజమేనని చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం పూజా హెగ్డే బాలీవుడ్లో కొన్ని సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలో అమ్మడు గుంటూరు కారం సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోతోందట.
గుంటూరు కారం(Guntur Karam) షూటింగ్ అనుకున్న దానికంటే ఆలస్యం అవుతుండడంతో.. ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు టాక్. దీంతో శ్రీలీల మెయిన్ హీరోయిన్గా టాప్ ప్లేస్‌లోకి వచ్చేసింది. ఇక పూజా ప్లేస్‌లో మరో యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్‌ను దాదాపు ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే శ్రీలీల, సంయుక్తకు ఇది బంఫర్ ఆఫర్ అనే చెప్పొచ్చు. అయితే ఈ విషయంలో మేకర్స్ నుంచి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమా నుంచి పూజా తప్పుకుందని చెప్పడానికి లేటెస్ట్ ఫోటో కూడా క్లారిటీ ఇచ్చేసినట్టే.
చివరగా బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ్ కిసీ కి జాన్ చిత్రంలో నటించిన పూజా.. అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఒక యాడ్‌లో నటిస్తోంది. అందుకు సంబంధించిన ఆన్ సెట్ స్నీక్-పీక్‌ను షేర్ చేసుకుంది. ఈ సందర్భంగా అమితాబ్ తనుకున్న అభిమానాన్ని చాటుకుంది. ప్రస్తుతం పూజా(Pooja Hegde), బిగ్ బి ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏదేమైనా.. ఇక పై పూజా బాలీవుడ్ సినిమాలకే పరిమితమైనట్టేనని చెప్పాలి.