మెగా బ్రాండ్‌తో.. మెగా హీరోల అండతో.. మెగా మేనల్లుడిగా.. హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్. అలాంటి ఈ యంగ్ హీరోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. హ్యాండ్ ఇచ్చారని తెలుస్తోంది. రీసెంట్గా రిలీజ్ అయిన తన తమ్ముడు సినిమా ‘రంగరంగ వైభవంగా’ మూవీ కోసం గట్టిగానే ప్రమోషన్స్ చేశాడు సాయి. ఈ సందర్భంగా యాక్సిడెంట్ విషయాన్ని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యాడు సాయి ధరమ్. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. ఇదిలా ఉంటే.. యాక్సిడెంట్ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయ్యాడు సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం ఓ సినిమా సెట్స్ పై ఉంది. ఇక ఈ సినిమా తర్వాత మెగా హీరోల్లో ఎవ్వరికీ రాని ఛాన్స్ ఈ మెగా మేనల్లుడు దక్కించుకున్నాడు.
సముద్ర ఖని దర్శకత్వంలో.. తమిళ్ హిట్ మూవీ ‘వినోదయ సీతమ్’ సినిమాలో పవన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు సాయి ధరమ్. ఇటీవలె సైలెంట్‌గా ఈ ప్రాజెక్ట్‌కు కొబ్బరికాయ కొట్టేశారు. దాంతో త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవబోతోందని వార్తలొచ్చాయి. అయితే లేటెస్ట్ అప్టేట్ ప్రకారం.. ఈ మూవీ ఇప్పట్లో తెరకెక్కే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఓ వైపు రాజకీయం, మరో వైపు సినిమాలతో పవన్ బిజీగా ఉండడంతో.. ఇప్పటికే కమిట్ అయిన హరిహర వీరమల్లు షూటింగ్ కంప్లీట్ కావడం లేదు. దాంతో ప్రస్తుతం ఈ రీమేక్ ప్రాజెక్ట్‌ను హోల్డ్‌లో పెట్టినట్టు టాక్. అంతేకాదు ఏకంగా పక్కన పెట్టే ఆలోచనలో కూడా ఉన్నట్టు ఇండస్ట్రీ వర్గాల మాట. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే.. పవన్‌తో కలిసి నటించాలనుకున్న సాయి ధరమ్‌కు.. ఇది నిరాశ అనే చెప్పొచ్చు.