రీ రిలీజ్ ట్రెండ్‌లో జల్సా సరికొత్త రికార్డు క్రియేట్ చేసినట్టు తెలుస్తోంది. పోకిరి రికార్డులు బద్దలు కొట్టేలా ముందుకు సాగిన పవర్ స్టార్ సైన్యం.. ఫైనల్‌గా సెన్సేషనల్ క్రియేట్ చేసినట్టు సమాచారం. గతంలో మహేష్ బర్త్ డే కానుకగా పోకిరిని రీ రిలీజ్ చేసి దుమ్ము దులిపారు మహేష్ అభిమానులు. 350 పైగా థియేటర్లలలో రిలీజ్ అయిన పోకిరి.. కోటిన్నరకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు పవన్ బర్త్ డే సందర్భంగా.. జల్సా మూవీని భారీ స్థాయిలో రీ రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 1న రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో.. 700 పైగా థియేటర్లలో రీ రిలీజ్ చేయగా భారీ రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఫ్యాన్స్ తాకిడితో థియేటర్లు దద్దరిల్లిపోయాయి.
కొన్ని చోట్లైతే విధ్వంసం సృష్టించారు. ఫ్యాన్స్ హంగామాతో సోషల్ మీడియా షేక్ అయిపోయింది. ఇక ఇప్పుడు అంతకు మించి అనేలా.. జల్సా రెండున్నర కోట్లకు పైగా వసూళ్లను అందుకున్నట్ట తెలుస్తోంది. అధికారికంగా తెలియకపోయినా.. రీ రిలీజ్ సినిమాల్లో జల్సా ఆల్ టైం రికార్డ్‌ను క్రియేట్ చేసిందని టాక్. దాంతో పవన్ స్టార్ క్రేజ్ ఏ రేంజ్లో ఉందో ఊహించుకోవచ్చు. ఇదంతా చూస్తుంటే.. రాబోయే రోజుల్లో రీ రిలీజ్ ట్రెండ్.. నెక్ట్స్ లెవల్‌కు వెళ్లేలానే కనిపిస్తోంది. ఇకపోతే త్రివిక్రమ్ దర్శకత్వంలో 2008లో వచ్చిన జల్సా.. అప్పట్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక 2006లో పూరి డైరెక్షన్లో వచ్చిన పోకిరి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇక్కడ మరో విశేషమేంటంటే.. ఈ రెండు సినిమాల్లో హీరోయిన్గా ఇలియానానే నటించింది. ఏదేమైనా పోకిరి, జల్సా.. మళ్లీ ట్రెండ్ సెట్ చేశాయనే చెప్పొచ్చు.