హీరో గోపీచంద్ హిట్ పడి చాలా కాలమే అవుతోంది. అందుకే ఎలాగైనా సరే.. ఈసారి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటాలని అనుకుంటున్నాడు ఈ మ్యాచో మ్యాన్. తనకు రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చినా డైరెక్టర్ శ్రీవాస్‌తో కలిసి.. రామబాణంగా(Ramabanam) వస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత.. గోపీకి హిట్ ఖాయమనే టాక్ నడుస్తోంది. అయితే ఈ సినిమాను తన ఫ్రెండ్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas)తో ప్రమోట్ చేయించి ఉంటే.. ఇంకా...
ప్రముఖ నటి, బిగ్ బాస్(Big Boss) ఫేమ్ పూజా రామచంద్రన్(Pooja Ramachandran) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కలిసి నటిస్తున్న చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. తాజాగా ఈ మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కనున్న సినిమాపై క్రేజీ రూమర్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
నిర్మాత దిల్ రాజు(Dil Raju) వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన ఆశిష్ తన రెండో చిత్రం సెల్ఫిష్(Selfish) తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీలో ఆశిష్ పాతబస్తీ కుర్రాడిగా మాస్ లుక్(Mass Look)లో కనిపించనున్నాడు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్(Arjun Rampal) 2001లో హిందీ సినిమా 'ప్యార్ ఇష్క్ ఔర్ మొహబ్బత్' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తెలుగుతో పాటు ఆంగ్ల సినిమాలో నటించాడు. ఆయన ప్రేయసి, మోడల్ గార్బెల్లా డెమట్రేడ్స్(Gabriella Demetriades) త్వరలో తల్లి కాబోతోంది. ఈ వార్తను స్వయంగా ఆమె సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఇన్ స్టా(Instagram) ద్వారా షేర్ చేసుకున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఉక్కు సత్యాగ్రహం. ఈ మూవీలో పల్సర్ బైక్ ఝాన్సీ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది.
అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన లేటేస్ట్ మూవీ ఏజెంట్. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది.
పొన్నియన్ సెల్వన్ 2 మూవీ మొదటి రోజు భారీ కలెక్షన్లు సాధించింది.
నేడు(ఏప్రిల్ 29) అంతర్జాతీయ డ్యాన్స్ దినోత్సవం. ఈ క్రమంలో నృత్యం గురించి తెలుసుకోవడంపాటు డ్సాన్స్ చేస్తే మీరు కూడా ఆరోగ్యకరంగా ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. డ్యాన్స్ చేయడం ద్వారా శరీరం మొత్తం వ్యాయామం చేసినట్లుగా తయారవుతుందని అంటున్నారు. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీల డ్యాన్సులను ఇప్పుడు చుద్దాం.
దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్2లో సారా అర్జున్ కీలక పాత్రలో కనిపించింది. మూవీలో ఆమె నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి.
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra).. హాలీవుడ్ ని దున్నేస్తోంది. అక్కడ వరస అవకాశాలు చేజిక్కించుకొని దూసుకుపోతోంది. చాలా మంది భారతీయ నటులకు ఆదర్శంగా నిలుస్తోంది. ప్రియాంకను రోల్ మోడల్ గా తీసుకొని హాలీవుడ్ లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నవారు చాలా మందే ఉన్నారు. అయితే... అక్కడకు వెళ్లిన మొదట్లో తాను కూడ చాలా కష్టాలు పడినట్లు ప్రియాంక చోప్రా చెప్పడం విశేషం.
నేషనల్ క్రష్ రష్మిక(Rashmika) ప్రస్తుతం పాన్ ఇండియా బ్యూటీగా దూసుకుపోతోంది. యానిమల్, పుష్ప2తో పాటు నితిన్‌తోను ఓ సినిమా చేస్తోంది. అలాగే రెయిన్‌బో అనే లేడీ ఓరియెంటేడ్ మూవీ కూడా చేస్తోంది. వీటితో పాటు ఇంకొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఈ క్రమంలో ఓ భారీ ప్రాజెక్ట్‌కు రష్మిక ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అందులో మహారాణిగా కనిపించబోతోందట అమ్మడు. ఇప్పటికే ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేసేసిందట.
విజయవాడ శివారులోని కానూరులో మాజీ సీఎం, దివంగత నటుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టార్ హీరోలు రజనీకాంత్, బాలకృష్ణతో పాటు చంద్రబాబు నాయుడు హాజరవగా పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, నందమూరి అభిమానులు పాల్గొన్నారు. రజనీకాంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ప్రస్తుతం టాలీవుడ్ ఉన్న స్టార్ హీరోల్లో అక్కినేని ఫ్యామిలీ(Akkineni family) నుంచి ముగ్గురు హీరోలు ఉన్నారు. ఏఎన్నార్ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ.. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరుగా నాగార్జున ఉన్నారు. నాగ్ లెగసినీ కంటిన్యూ చేస్తూ.. నాగచైతన్య, అఖిల్ హీరోలుగా రాణించేందుకు చాలా కాలంగా గట్టిగా ట్రై చేస్తున్నారు. కానీ వర్కౌట్ అవడం లేదు. లేటెస్ట్ ఫిల్మ్ ఏజెంట్ కూడా ఫ్యాన్స్‌ను నిరాశ పరిచింది.