గత ఏడాది పొన్నియన్ సెల్వన్1 (Ponniyan Selvan 1) సినిమా విడుదలై విమర్శనలను ఎదుర్కొంది. చోళుల జీవిత చరిత్ర(Cholas History) ఆధారంగా తెరకెక్కించిన ఆ మూవీ పాన్ ఇండియా(Pan India) స్థాయిలో విడుదలైంది. తమిళనాట పొన్నియన్ సెల్వన్ మూవీ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే మిగిలిన ఇండస్ట్రీలల్లో అంతగా ఆడలేదు. తాజాగా పొన్నియన్ సెల్వన్ 2 (Ponniyan Selvan 2) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీకి మొదటి రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురుస్తోంది.
బాహుబలి మూవీ(Bahubali Movie) తర్వాత ఆ ట్రెండ్ ను సెట్ చేయడానికి ఇతర భాషల్లోని దర్శకులు ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళంలో పొన్నియన్ సెల్వన్ (Ponniyan Selvan ) మూవీ రెండు భాగాలుగా మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో మొదటి పార్టు గత ఏడాడి సెప్టెంబర్ 30వ తేదిన విడుదలైంది. తాజాగా రెండో భాగం థియేటర్లలోకి వచ్చేసింది. ఈ మూవీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది.
పొన్నియన్ సెల్వన్(Ponniyan Selvan 1) మొదటి పార్టుకు ఓవరాల్గా రూ.500 కోట్ల వరకూ కలెక్షన్స్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పుడు సీక్వెల్ కూడా మంచి వసూళ్లు వస్తున్నట్లు సమాచారం. పొన్నియన్ సెల్వన్2(Ponniyan Selvan 2) సినిమాకు వరల్డ్ వైడ్గా మొదటి రోజు రూ.35 కోట్ల వరకూ కలెక్షన్లు దక్కాయి. అందులో తమిళనాడులో రూ.25 కోట్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల వరకూ రాగా కర్ణాటకలో రూ.4 కోట్ల వరకూ కలెక్షన్లు వచ్చినట్లు సమచారం. ఓవరాల్గా చూస్తే అన్ని చోట్ల కలిపి రూ.35 కోట్ల వసూళ్లను మొదటి రోజే సాధించినట్లు తెలుస్తోంది. ఇదే హవా కొనసాగితే ఈ వీకెండ్ పూర్తయ్యే సరికి పొన్నియన్ సెల్వన్ 2 మూవీ రూ.100 కోట్ల మార్కును చేసుకునే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.