»Om Raut Who Kissed Kriti In Tirumala Devotees Fire On Aadipurush Director
Adipurush: తిరుమలలో కృతికి ముద్దు పెట్టిన ఓం రౌత్..ఆదిపురుష్ డైరెక్టర్‌పై భక్తులు ఫైర్
తిరుమలలో ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ ఆలయం ముందు కృతిసనన్‌కు ముద్దు పెట్టడంతో అక్కడున్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తిరుపతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్(Adipurush pre Release Event) ఎంతో వేడుకగా జరిగింది. భారీ సంఖ్యలో ప్రభాస్(Prabhash) అభిమానులు తిరుపతికి చేరుకుని ఆ ఈవెంట్‌ను విజయవంతం చేశారు. రామాయణం(raamayanam) కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు. సీతగా కృతిసనన్(Kritisanan) నటించింది. చిన్న జీయర్ స్వామి గెస్ట్‌గా విచ్చేసిన ఈ ఈవెంట్ ఫుల్ సక్సెస్ అయ్యింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ అయ్యాక నేడు తిరుమల శ్రీవారిని ఆదిపురుష్ టీమ్ దర్శించుకుంది.
తిరుమల ఆలయం ముందు కృతిసనన్‌కు ముద్దు పెట్టిన ఓం రౌత్ వీడియో:
https://twitter.com/i/status/1666290293573038081
హీరోయిన్ కృతిసనన్(Kritisanan), డైరెక్టర్ ఓం రౌత్(Director Om Raut), నిర్మాత భూషణ్ కుమార్ తిరుమల శ్రీవారి(Tirumala srivaru)ని దర్శించుకున్నారు. ఆలయం నుంచి బయటకు రాగానే మీడియాకు కనిపించారు. ఆలయం నుంచి వెళ్తున్న కృతి సనన్ కోసం కారు రాగానే ఆమె అందరికీ వీడ్కోలు చెబుతూ హగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ ఓం రౌత్‌కు కూడా హగ్ ఇవ్వగానే ఆయన మాత్రం కృతిసనన్ బుగ్గపై ముద్దు పెట్టాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది.
అందరికీ హగ్ ఇచ్చి వెళ్లిపోయుంటే సరిపోయేది. కానీ డైరెక్టర్ ఆలయం ముందు అలా హీరోయిన్‌కు ముద్దు పెట్టడంతో అక్కడున్న భక్తులు ఫైర్ అయ్యారు. పవిత్ర ఆలయం ముందు ఇలాంటి పనులేంటని ఓం రౌత్(Om Raut)పై నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడా ఆదిపురుష్ సినిమా(Adipurush Movie) పలు వివాదాల్లో చిక్కుకుంది. ఇటీవలె సినిమాపై మంచి హైప్ రాగా ఇప్పుడు ఆలయం ముందు ముద్దు ఘటనతో మరోసారి ఆదిపురుష్ టీమ్ వివాదంలో నిలిచింది.