»Ntrs Name In Bricks A Fan Who Is Innovatively Building A House With Love
Jr.NTR: ఇటుకల్లో ఎన్టీఆర్ పేరు..ప్రేమతో వినూత్నంగా ఇల్లు కట్టిస్తోన్న అభిమాని
ఎన్టీఆర్‌పై ఓ అభిమాని తన ప్రేమను వినూత్నంగా చాటుకున్నాడు. తాను నిర్మించే ఇంటికి జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఉన్న ఇటుకలను వినియోగిస్తున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR)కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు. ఆర్ఆర్ఆర్ (RRR) మూవీ విడుదల తర్వాత ప్రపంచ వ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్‌కు క్రేజ్ బాగా పెరిగింది. ఆ మూవీతో అటు నార్త్ ఇండస్ట్రీలోనూ ఎంతో మంది ఆయనకు ఫ్యాన్‌గా మారిపోయారు. ఆర్ఆర్ఆర్ మూవీలో కొమురం భీమ్ పాత్రలో తారక్ ఒదిగిపోయాడు. ఆయన నటనకు హాలీవుడ్ మేకర్స్ (Hollywood Makers) సైతం ఫిదా అయ్యారు. ప్రస్తుతం తారక్ ‘దేవర’ మూవీ (Devara Movie) చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.
— MadhuYadav (jr.NTR) Kurnool (@MadhuYadavTarak) November 3, 2023
తాజాగా తారక్‌పై తన అభిమాని వినూత్నంగా తన ప్రేమను, అభిమానాన్ని చాటుకున్నాడు. తాను నిర్మించే ఇంటికి ఎన్టీఆర్ పేరుతో ముద్రించిన ఇటుకలను వినియోగించాడు. ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రాష్ట్రంలోని కర్నూలు జిల్లా (Kurnool District)లో ఓ అభిమాని కొత్త ఇంటిని నిర్మిస్తున్నాడు. తన ఇంటి నిర్మాణానికి ఉపయోగించే ఇటుకలపై ఎన్టీఆర్ పేరును (NTR Name) ముద్రించాలనుకున్నాడు. అలా ఇంటికి కావాల్సిన అన్ని ఇటుకలపై తారక్ పేరును ముద్రించి ఇంటిని నిర్మిస్తున్నాడు. ఈ రకంగా తన అభిమాన హీరోపై ప్రేమను చాటుకున్నాడు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పేరుతో ఉన్న ఇటుకల ఫోటోలు వైరల్ (Photos Viral) అవుతున్నాయి. తారక్‌పై అతని ప్రేమను చూసి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ దేవర మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్ విడుదల అయ్యాయి. అనిరుధ్ రవిచందర్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు బాలీవుడ్ మూవీ వార్2 (War 2 Movie)లోనూ తారక్ నటిస్తుండటం విశేషం. ఈ రెండు చిత్రాలు శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటున్నాయి.