ఎన్టీఆర్ 30 అనుకున్నట్టే జరుగుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఇంకొంచెం వెనక్కి వెళ్లినట్టు తెలుస్తోంది. గతంలో ఫిబ్రవరిలో ఈ సినిమాను స్టార్ట్ చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. దాంతో ఫిబ్రవరి ఎండింగ్లో షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని వినిపించింది. అయితే ఇప్పుడు మార్చికి షిప్ట్ అయినట్టు తెలుస్తోంది. మార్చి 20 నుంచి రెగ్యూలర్ షూటింగ్ మొదలు కాబోతున్నట్టు ఇండస్ట్రీ టాక్. మార్చి 12న ఆస్కార్ అవార్డ్స్ ఫైనల్ ఉంది. ఆ తర్వాతే ఎన్టీఆర్ 30 ఉంటుందని వినిపించింది. అన్నట్టుగానే ఇప్పుడు 20కి ఫిక్స్ అయిపోయారని టాక్. ప్రస్తుతం కొరటాల శివ భారీ సెట్టింగులు వేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా తర్వాత కెజియఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. ప్రస్తుతం సలార్ మూవీతో బిజీగా ఉన్నాడు ప్రశాంత్ నీల్. సెప్టెంబర్ 28న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. దాంతో సెప్టెంబర్ నుంచి ఎన్టీఆర్ సినిమా సెట్ వర్క్ స్టార్ట్ అవుతుందని సమాచారం. వాస్తవానికి ప్రశాంత్ నీల్ సమ్మర్లోనే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్టు ప్రకటించాడు. కానీ ఎన్టీఆర్ 30 లేట్ అవడంతో.. ఎన్టీఆర్ 31 మరింత లేట్‌గా స్టార్ట్ అవనుందని అంటున్నారు. అయితే కొరటాల మాత్రం అనుకున్న సమయానికి.. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న, సినిమా రిలీజ్ చేయడమే టార్గెట్‌గా బరిలోకి దిగబోతున్నాడు. మొత్తంగా ఎన్టీఆర్ 30 అనుకున్న సమయానికి మాత్రం సెట్స్ పైకి వెళ్లడం లేదు. మరి ఈ సినిమాలతో తారక్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.