»Ntr Was Badly Cheated By Buying A Place By Spending Crores
NTR: కోట్లు పెట్టి స్థలం కొని.. ఘోరంగా మోసపోయిన ఎన్టీఆర్
గతంలో కోట్లు పెట్టి ఓ స్థలాన్ని కొన్న ఎన్టీఆర్ ఇప్పుడు దారుణంగా మోసపోయాడు. కోట్లు పెట్టి చేతులు కాల్చుకున్నాడు. దీనికి కారణం జూబ్లీహిల్స్ హౌసింగ్ సోసైటీలోని ఆయన కొన్న ఖరీదైన స్థలం.
NTR was badly cheated by buying a place by spending crores
NTR: తెలుగు ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ భారీ క్రేజ్ ఉన్న నటుడు. అంతే కాదు స్మార్ట్ అండ్ ఇంటలిజెన్స్‌లో కూడా ఆయనకు ఆయనే సాటి. ఆయన మాటలో బెరుకుండదు, అడుగులో తడబాటు అసలే ఉండదు అని ఫ్యాన్స్ బలంగా నమ్ముతారు. అలాంటిది ఎన్టీఆర్ ఇప్పుడు దారుణంగా మోసపోయాడు. కోట్లు పెట్టి చేతులు కాల్చుకున్నాడు. దీనికి కారణం జూబ్లీహిల్స్ హౌసింగ్ సోసైటీలోని ఆయన కొన్న ఖరీదైన స్థలం.. పూర్తి వివరాల్లోకి వెళితే..
నిను చూడాలని సినిమాతో 2001లో తెలుగు పరిశ్రమలో హీరోగా అడుగుపెట్టిన ఎన్టీర్.. ఆది సినిమాతో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి యమ బిజీ అయ్యారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆ సమయంలో ఖరీదైన ఓ స్థలాన్ని కొన్నారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని 681 చదరపు గజాల స్థలాన్ని 2003లో కొనుగోలు చేశారు. ఆ ప్రాపర్టీ ఓనర్ సుంకు గీత అన్ని సరిగానే ఉన్నాయని డాక్యుమెంట్స్ ఇచ్చి చేతులు దులుపుకుంది. ఆమే మాటలు గుడ్డిగా నమ్మిన ఎన్టీఆర్ ఆ స్థలంలో కోట్లు పెట్టి ఇల్లు కూడా నిర్మించుకున్నారు. తాజాగా ఆ ఇంటిపై పాత ఓనర్ సుంకు గీత లోన్ తీసుకున్నట్లు తెలుస్తుంది.
1996లోనే వివిధ బ్యాంకుల్లో ఆ స్థలాన్ని తాకట్టుపెట్టి రుణం తీసుకున్నారు. దాన్ని కట్టకుండా ఎగ్గొట్టారు. దాంతో ఎస్బీఐ, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఇండ్స్ ఇండ్, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులు సర్ఫేసీ యాక్ట్ కింద డెట్ రకవరీ ట్రైబ్యునల్‌లో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన డీఆర్టీ ఎన్టీఆర్‌కు భారీ షాక్ ఇచ్చింది. ఆ స్థలంపై ఎన్టీఆర్‌కు ఎలాంటి హక్కులేదని, ఆ ప్రాపర్టీ మొత్తం బ్యాంకులదే అని తీర్పు ఇచ్చింది. తాజా తీర్పుతో ఎన్టీఆర్ ఇల్లును, స్థలాన్ని కోల్పొయే ప్రమాదం ఉంది. ఈ వివాదం తెలిసిన ఎన్టీఆర్ తనను మోసం చేశారంటూ గీతపై కేసు నమోదు చేశారు. అదేవిదంగా డీఆర్టీ తీర్పుపై హైకోర్టును ఆశ్రయించారు.
ఈ వివాదం కోర్టులో ముందుకెళ్లడానికి కొన్ని డాక్యుమెంట్స్, డీఆర్టీ ఆర్డర్ కాపీ కోసం సమయం కావాలని ఎన్టీఆర్ తరఫు న్యాయవాది కోరగా అందుకు ధర్మాసనం నిరాకరించింది. అయితే విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. దీన్ని బట్టి చూస్తే సుంకు గీత చేతులో ఎన్టీఆర్ దారుణంగా మోసపోయారు అని అర్థం అవుతుంది. బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం తెచ్చుకొని ఎన్టీఆర్‌ను బురిడి కొట్టించింది. దాంతో స్థలానికి కోట్లుపెట్టి కొన్ని ఖరీదైన ఇల్లు కూడ నిర్మించారు. ఇప్పుడు ఆ మొత్తం బ్యాంకులే జప్తు చేసుకునే అవకాశం ఉంది. వాటిని వేలం వేసి బ్యాంకులు తమ రుణాన్ని రికవరీ చేసుకుంటాయి. ఈ మొత్తం వివాదంలో బలిక బకరా అయ్యేది ఎన్టీఆర్ అని స్పష్టంగా అర్థం అవుతుంది. మరీ దీనిపై ఆయన ఏ విధమైన చర్యలు తీసుకుంటారో చూడాలి.