టాలీవుడ్(Tollywood) యంగ్ హీరో సంతోష్ శోభన్(santhosh Sobhan) చేస్తున్న సినిమా ‘అన్నీ మంచి శకునములే'(Anni manchi Sakunamule). ఈ మూవీలో మాళవిక నాయర్(Malavika Nair) హీరోయిన్గా చేస్తోంది. లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి(Director Nandini Reddy) ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పటి వరకూ ఈ మూవీ ప్రేక్షకుల్లో మంచి బజ్ ను క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇవన్నీ సినిమాపై పాజిటివ్ వైబ్స్ ను క్రియేట్ చేశాయి.
తాజాగా అన్నీ మంచి శకునములే సినిమా(Anni manchi Sakunamule Movie) ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్(Trailer Release) చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) ఈ మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ తో కలిసి లాంచ్ చేశారు. ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇది రెండు ఫ్యామిలీల మధ్య జరిగే కథ. సినిమా మొత్తం ఒక క్యూట్ లవ్ స్టోరీ మధ్య సాగుతుంది. సంతోష్ శోభన్(santhosh Sobhan), మాళవిక నాయర్(Malavika Nair)ల మధ్య సాగే కెమిస్ట్రీ అందర్నీ మెస్మరైజ్ చేస్తుంది.
ఈ వేసవికి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ‘అన్నీ మంచి శకునములే మూవీ'(Anni manchi Sakunamule Movie) రాబోతోంది. ఈ మూవీకి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాను స్వప్న బ్యానర్‌పై ప్రియాంక దత్ నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా ఈ మూవీ మే 18వ తేదిన రిలీజ్(Release) చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.