Vishwak Sen : థాంక్యూ అన్నా.. ఇండియా మొత్తం గర్వపడేలా చేశావ్.. ఇప్పుడు కాదు, ఎప్పుడో చెప్పా.. ఇండియా మొత్తంలో బెస్ట్ యాక్టర్ ఎవడ్రా అంటే.. నా ఎన్టీఆర్ అని, ఆ మాస్ ఈ మాస్ కాదు.. నా మాస్ అమ్మ మొగుడు.. 17 ఏళ్లకే తొడగొట్టి బాంబ్‌లు వేసిన హీరో.. నాకు తెలిసి మళ్లీ అది హిస్టరీలో రీపీట్ కాదు..
థాంక్యూ అన్నా.. ఇండియా మొత్తం గర్వపడేలా చేశావ్.. ఇప్పుడు కాదు, ఎప్పుడో చెప్పా.. ఇండియా మొత్తంలో బెస్ట్ యాక్టర్ ఎవడ్రా అంటే.. నా ఎన్టీఆర్ అని, ఆ మాస్ ఈ మాస్ కాదు.. నా మాస్ అమ్మ మొగుడు.. 17 ఏళ్లకే తొడగొట్టి బాంబ్‌లు వేసిన హీరో.. నాకు తెలిసి మళ్లీ అది హిస్టరీలో రీపీట్ కాదు.. ఎన్టీఆర్‌ను ఇప్పటివరకు చూసింది టీజర్ మాత్రమే.. అసలు సినిమా ఇప్పుడు మొదలైంది… ఇలా ఒక డై హార్డ్ ఫ్యాన్‌గా ఎన్టీఆర్‌కు నెక్స్ట్ లెవల్ ఎలివేషన్ ఇచ్చాడు విశ్వక్ సేన్. ఎంతలా అంటే.. ఎన్టీఆర్ క్రేజ్‌లో తన సినిమా ధమ్కీ గురించి కూడా మాట్లాడడం మర్చిపోయి మరీ.. మాస్ ఎలివేషన్ ఇచ్చాడు. ఇదే ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్‌కు మరింత జోష్ నింపింది. ముఖ్యంగా ధమ్కీ ఈవెంట్ నుంచి ఎన్టీఆర్‌ను మాస్ అమ్మా మొగుడు అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు అభిమానులు. ఇదే కాదు.. ఈ మధ్య యంగ్ టైగర్‌కు ఊరమాస్ బిరుదులిస్తున్నారు అభిమానులు. మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటూ ట్రెండ్ చేస్తునే ఉన్నారు. ట్రిపుల్ ఆర్ ఆస్కార్ కొట్టేయడంతో.. ఇక పై గ్లోబల్ స్టార్ అంటున్నారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలుగు ప్రైడ్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ పేరు చివర.. ఏదో ఒక కొత్త బిరుదు యాడ్ అవుతునే ఉంది. ఇప్పుడే ఇలా ఉంటే.. ఇక అప్ కమింగ్ సినిమాలతో.. యంగ్ టైగర్ రోరింగ్ నెక్స్ట్ లెవల్లో ఉండబోతోందనే చెప్పొచ్చు. కొరటాల శివ, ప్రశాంత్ నీల్ సినిమాలు.. ఎన్టీఆర్‌కు ఇంకొన్ని మాస్ బిరుదులు తెచ్చి పెట్టడం పక్కా. త్వరలోనే ఎన్టీఆర్ 30 సెట్స్ పైకి వెళ్లనుంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ 31 స్టార్ట్ కానుంది.