Vishwak Sen : యంగ్ టైగర్ ఎన్టీఆర్ డై హార్డ్ ఫ్యాన్స్‌లో.. యంగ్ హీరో దాస్ కా మాస్ విశ్వక్ సేన్ అందరికంటే ముందుంటాడు. ఎన్టీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని.. లాస్ట్ బ్రీత్ వరకు ఆయనే తన అభిమాన హీరో అని.. యాక్టింగ్‌లో తారక్‌ను కొట్టేవాడే లేడని.. సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతునే ఉన్నాడు విశ్వక్ సేన్.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ డై హార్డ్ ఫ్యాన్స్‌లో.. యంగ్ హీరో దాస్ కా మాస్ విశ్వక్ సేన్ అందరికంటే ముందుంటాడు. ఎన్టీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని.. లాస్ట్ బ్రీత్ వరకు ఆయనే తన అభిమాన హీరో అని.. యాక్టింగ్‌లో తారక్‌ను కొట్టేవాడే లేడని.. సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతునే ఉన్నాడు విశ్వక్ సేన్. అలాంటి అభిమాని కోసం ఎన్టీఆరే గెస్ట్‌గా వస్తే.. ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అది కూడా ఆస్కార్ అవార్డ్ అందుకొని.. ఇండియాకి వచ్చిన వెంటనే ఈవెంట్ అంటే.. విశ్వక్ సేన్ పంట పండినట్టే. త్వరలోనే విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఫిల్మ్ ‘దాస్ కా ధమ్కీ’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇంకా అధికారికంగా చెప్పకపోయినా.. ఉగాది కానుకగా మార్చి 22న ఈ సినిమాను ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. మార్చి 17న హైదరాబాద్‌లో గ్రాండ్ నిర్వహించబోతున్నారట. ఈ ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నారనే టాక్ ఉంది. అయితే ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు తారక్. మార్చి 12న జరగనున్న ఆస్కార్ ఈవెంట్లో పాల్గొనబోతున్నాడు. ఈ నేపధ్యంలో తారక్ ధమ్కీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి అటెండ్ అవుతాడా.. లేదా.. అనేది ఇప్పుడే చెప్పలేం. కానీ ఆస్కార్ అందుకున్న తర్వాత తన అభిమాని కోసం.. ఎన్టీఆర్ గెస్ట్‌గా వస్తే మాత్రం.. ధమ్కీ సినిమా పై భారీ హైప్ రావడం పక్కా. అందుకే ఇంకా విశ్వక్ సేన్ ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదేమో. మరి ధమ్కీ రిలీజ్ అండ్ ఈవెంట్ ఎప్పుడుంటుందో చూడాలి.