ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, భారత పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ (Mukesh Ambani) తన భార్యకు అద్భుతమైన కట్టడాన్ని నిర్మించాడు. దేశంలోనే ప్రముఖ స్థలంగా ఆ భవనాన్ని తీర్చిదిద్దారు. ఈ భవనం ప్రారంభోత్సవానికి రాజకీయ, సినీ, క్రీడా, పారిశ్రామిక ప్రముఖులు (VVIPs) తరలివచ్చారు. ఈ భవనం ప్రారంభోత్సవం (Launch) కోలాహలంగా జరిగింది. కాగా ఈ కేంద్రం దేశంలోనే ప్రముఖ స్థలంగా నిలువనుంది. శ్రీరామనవమి ప్రత్యేక పూజల అనంతరం నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ (Nita Mukesh Ambani Cultural Centre -NMACC) ప్రారంభమైంది.
మహారాష్ట్ర (Maharashtra) రాజధాని ముంబై (Mumbai)లోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ లో జియో వరల్డ్ సెంటర్ (Jio World Center) ఉంది. ఈ కేంద్రంలో సరికొత్తగా.. దేశంలో అత్యాధునిక.. అత్యంత విశాలంగా కల్చరల్ సెంటర్ ను నిర్మించారు. దీనికి అంబానీ తన భార్య నీతా అంబానీ (Nita Ambani) పేరును నామకరణం చేశాడు. కాగా శుక్రవారం జరిగిన ప్రారంభోత్సవానికి బాలీవుడ్ తారలు (Bollywood) తరలివచ్చారు. దేశంలోనే అతి పెద్ద సాంస్కృతి కేంద్రంగా (Cultural Centre) ఈ కేంద్రం నిలువనుంది.
సినీ పరిశ్రమ నుంచి బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్, గౌరీ, పిల్లలు ఆర్యన్ ఖాన్, సుహానా ఖాన్ కుటుంబసమేతంగా హాజరయ్యాడు. సల్మాన్ ఖాన్, వరుణ్ ధావన్, షాహిద్ కపూర్, అనుష్క శర్మ, విద్యా బాలన్, దీపికా పదుకొనే, రణ్ వీర్ సింగ్, ప్రియాంకా చోప్రా, సిద్ధార్థ్ మల్హొత్రా, కియారా అద్వానీ, సూపర్ స్టార్ రజనీకాంత్, కుమార్తె సౌందర్య, అలియా భట్, అమీర్ ఖాన్, కరీనా కపూర్, ఐశ్వరా రాయ్ తదితరులు వచ్చారు. ఇక కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ, హేమమాలిని, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవీస్, అమృత ఫడ్నవీస్ దంపతులు హాజరయ్యారు. క్రీడా రంగం నుంచి సానియా మీర్జా, యువరాజ్ సింగ్ తదితరులు సందడి చేశారు.
దేశంలోనే అతిపెద్ద సాంస్కృతిక కేంద్రంగా నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ను నిర్మించారు. ఈ కేంద్రంలో ఒకేసారి 2 వేల మంది కూర్చోవచ్చు. 52, 627 చదరపు అడుగుల్లో నిర్మించిన ఈ కేంద్రంలో నాలుగు అంతస్తులు ఉన్నాయి. ఆర్ట్ హౌస్, పెవిలియన్, ఆర్ట్ షో, ఎగ్జిబిషన్ లు ప్రదర్శించవచ్చు. దీనిలో మ్యూజియం, స్టూడియో థియేటర్ కూడా ఉన్నాయి. సినిమా, సంగీతం, నాటకం, సాహిత్యం, జానపద కథలు, కళలు, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఈ కేంద్రాన్ని నిర్మించినట్లు నీతా అంబానీ తెలిపారు. ఈ కేంద్రం నిర్మించడం తన అదృష్టంగా పేర్కొన్నారు.
Nita M Ambani talks about the realization of a lifelong dream as doors open to the #NMACC. Celebrating her vision, Mukesh Ambani describes NMACC as, “A coming of age for India & the beginning of a new era for arts & culture”