టాలీవుడ్ కింగ్, మన్మథుడు, యువ సామ్రాట్.. తెలుగు సీనియర్ హీరో అక్కినేని నాగార్జున.. నేడు తన 63వ బర్త్ డే సెలబ్రేషన్స్ జరుకుంటున్నారు.1959 ఆగస్ట్ 29న జన్మించిన నాగార్జున.. ఆరు పదుల వయసులోను దుమ్ములేపుతున్నాడు. సినిమాలే కాదు.. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’, ‘బిగ్ బాస్’ వంటి ఎన్నో షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ.. యంగ్ హీరోలకు ధీటుగా దూసుకుపోతున్నాడు. ది గ్రేట్ అక్కినేని నాగేశ్వర రావు వారసుడిగా.. 1986లో ‘విక్రమ్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున. ఆ తర్వాత ‘మజ్ను’, ‘గీతాంజలి’ వంటి సినిమాలతో లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్న నాగ్.. ఆ పై 1989లో వచ్చిన ‘శివ’ సినిమాతో భారీ మాస్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు.
అప్పట్లో శివ మూవీ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఇప్పటికీ శివ సినిమా బుల్లితెరపై కనిపిస్తే చాలు అతుక్కుపోతుంటారు అక్కినేని అభిమానులు. అయితే ఒక్క క్లాస్, మాస్ అనే కాదు.. కామెడీతో పాటు ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేశారు నాగార్జున. ముఖ్యంగా ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘షిరిడి సాయి’, ‘ఓం నమో వెంకటేశాయ’ వంటి భక్తిరస సినిమాలు చేసి మెప్పించారు. ఇలా అన్ని జానర్లలో సినిమాలు చేసి.. చేస్తూ.. ఇప్పటికీ టాలీవుడ్ కింగ్‌గా సాగుతున్నాడు నాగార్జున. ఇక యంగ్ టాలెంట్‌ను ప్రొత్సహించే మన్మధుడు.. ఎంతో మంది కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అలాగే కొన్ని సినిమాల్లో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చి.. మిగతా హీరోలను ఎంకరేజ్ చేశాడు. ప్రస్తుతం బాలీవుడ్ నుంచి వస్తున్న భారీ మూవీ ‘బ్రహ్మస్త్ర’లో కీలక పాత్రలో నటించాడు. అలాగే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నటిస్తున్న ‘ది ఘోస్ట్’ మూవీ అక్టోబర్ 5న రిలీజ్‌కు సిద్దమవుతోంది. ఇక తన కెరీర్లో తండ్రి, తనయులతో కలిసి నటించిన ‘మనం’ మూవీ.. నాగ్ కెరీర్లో మైలు రాయిగా నిలిచిపోయింది. ప్రస్తుతం నాగార్జున వారసత్వాన్ని అందిపుచ్చుకొని.. నాగచైతన్య, అఖిల్ హీరోలుగా రాణిస్తున్నారు. మరి మన తరపున కూడా కింగ్ నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు.