సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత.. అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya) మరో హీరోయిన్‌తో తిరుగుతున్నాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. తెలుగు ముద్దుగుమ్మ శోభిత ధూళిపాళ్ల(shobitha dhulipala)తో చైతూ ఎఫైర్ వ్యవహారం.. సందర్భం వచ్చినప్పుడల్లా హాట్ టాపిక్ అవుతునే ఉంది. బాలీవుడ్లో పలు సినిమాలు చేసిన శోభిత.. తెలుగులో అడవిశేష్ హీరోగా తెరకెక్కిన గూఢచారి, మేజర్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.. అయితే మేజర్ సినిమా రిలీజ్ టైంలో ఈ బ్యూటీతో చైతు ప్రేమలో ఉన్నాడనే న్యూస్ అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ ఇందులో నిజం లేదని.. కావాలనే సమంత పీఆర్ టీమ్ ఈ పుకారు పుట్టించిందని.. చైతన్య టీమ్ వాదించింది. దాంతో స్వయంగా సమంతనే సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చింది.
‘అమ్మాయిపై పుకార్లు వస్తే నిజమే, కానీ అబ్బాయిపై పుకార్లు వస్తే మాత్రం.. అమ్మాయే చేయించిందంటారు.. మేము ఎప్పుడో మూవ్ అన్ అయిపోయాము.. మీరు కూడా మూవ్ ఆన్ అవ్వండి.. మీ పని మీద, మీ కుటుంబాల పై దృష్టి పెట్టండని’ కాస్త సీరియస్ అయింది. అయినా కూడా శోభిత, చైతన్య లవ్ మ్యాటర్లో క్లారిటీ రాలేదు. పైగా చైతూ కూడా ఈ వార్తపై స్పందించలేదు.. దాంతో నిప్పు లేనిదే పొగ రాదని.. వీళ్ల ఎఫైర్ నిజమేననేది ఇండస్ట్రీ టాక్. ఈ నేపథ్యంలో.. మళ్లీ ఇన్నాళ్లకు శోభిత పెళ్లి ఫోటో షూట్‌తో ఈ న్యూస్ వైరల్‌గా మారింది. అది కూడా సమంత ‘మయో సైటిస్’ అనే అరుదైన వ్యాధి బారిన పడిన సమయంలో.. పెళ్లి కూతురు గెటప్‌లో కనిపించడంతో.. మళ్లీ చైతన్య-శోభిత హాట్ టాపిక్ అయ్యారు.
అయితే నిజంగానే ఈ అమ్మడు పెళ్లి చేసుకోలేదులేండి. ఓ యాడ్‌లో భాగంగా.. వెడ్డింగ్స్ ఇన్ దుబాయ్ అనే హ్యాష్ టాగ్ ఉపయోగించి.. అందుకు సంబంధించిన ఫోటో షూట్ షేర్ చేసింది శోభిత. కానీ ఒక్కసారిగా పెళ్లి కూతురిలా కనిపంచడంతో.. నిజంగానే అమ్మడికి పెళ్లైపోయిందా.. అని కాస్త షాక్ అయ్యారు అభిమానులు. అయితే అసలు విషయం తెలిసాక.. రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అమ్మడు నిజంగానే పెళ్లి చేసుకున్నంత షాక్ ఇచ్చిందని అంటున్నారు. అలాగే ఈ కమర్షియల్ పెళ్లి కూతురు ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందని అడుగుతున్నారు. అయితే.. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఈ ఫోటో షూట్‌తో ఈ బ్యూటీఫుల్ గర్ల్ నిజంగానే చైతూతో ప్రేమలో ఉందా.. లేదా అని.. మరోసారి డైలమాలో పడిపోయారు నెటిజన్స్. మొత్తంగా.. మరోసారి శోభిత-చైతన్య లవ్ మ్యాటర్ హాట్ టాపిక్‌గా మారింది.