Naga Chaitanya : అక్కినేని నాగ చైతన్యకు అర్జెంట్‌గా ఓ హిట్ కావాలి. థ్యాంక్యూ, లాల్ సింగ్ చడ్డాతో డీలా పడిపోయిన చైతూ.. ఈసారి ఎలాగైనా సరే సక్సెస్ ట్రాక్ ఎక్కాలని గట్టిగా ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం చై ఆశలన్నీ కస్టడీ సినిమా పైనే ఉన్నాయి.
అక్కినేని నాగ చైతన్యకు అర్జెంట్‌గా ఓ హిట్ కావాలి. థ్యాంక్యూ, లాల్ సింగ్ చడ్డాతో డీలా పడిపోయిన చైతూ.. ఈసారి ఎలాగైనా సరే సక్సెస్ ట్రాక్ ఎక్కాలని గట్టిగా ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం చై ఆశలన్నీ కస్టడీ సినిమా పైనే ఉన్నాయి. మే 12న కస్టడీ మూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో టీజర్ రిలీజ్ చేస్తున్నట్టు టీజర్ టీజ్ అంటూ ఓ వీడియో చేశారు మేకర్స్. ఊపిరి బిగపట్టుకోండి.. టీజర్ వచ్చేస్తోంది అంటూ ప్రకటించారు. టీజర్ టీజ్‌లో అండర్ వాటర్‌లో లాకప్ నుంచి బయటకొస్తున్నాడు చైతూ. దాంతో కస్టడీ టీజర్ కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు అక్కినేని అభిమానులు. ఈ టీజర్‌ను మార్చి 16, సాయంత్రం 4 గంటల 51 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్, గ్లింప్స్‌లోనే చైతన్యను పవర్ ఫుల్ చూపించాడు దర్శకుడు వెంకట్ ప్రభు. ఇక ఇప్పుడు టీజర్‌తో సినిమా మరింత హైప్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాను.. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. నాగ చైతన్యకు జోడీగా కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. బంగర్రాజు తర్వాత ఇద్దరు కలిసి నటిస్తున్న సినిమా ఇదే. విలన్‌గా అరవింద్ స్వామి నటిస్తున్నాడు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా కలిసి సంగీతం అందిస్తున్నారు. మరి కస్టడీ మూవీ చైతన్యకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.