Naga Chaitanya: ఇండియన్ రేసింగ్ టీం కొనేసిన యంగ్ హీరో!
పోయిన సమ్మర్లో కస్టడీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అక్కినేని నాగచైతన్య. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. దీంతో ఇక పై సినిమాలు ఎంపిక విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు చైతన్య. అలాగే బిజినెస్ పరంగా కూడా దూసుకుపోతున్నాడు.
Naga Chaitanya: కస్టడీ వంటి ఫ్లాప్ తర్వాత ప్రస్తుతం భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు నాగ చైతన్య. చందు మొండేటి దర్శకత్వంలో ఒక రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా సినిమా చేస్తున్నాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులు గుజరాత్ వెళ్లి అక్కడి నుంచి సముద్రంలో వేటకు వెళ్లగా.. పాకిస్తాన్ నేవీకి చిక్కి కొన్నాళ్ల పాటు జైలు శిక్ష అనుభవించి.. తర్వాత రెండు ప్రభుత్వాల చొరవతో విడుదలయ్యారు. అందులో ఒక వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఇప్పటికే మత్స్యకారుల గ్రామానికి వెళ్లి వెళ్లి నాగచైతన్య, చందు మొండేటి, బన్నీ వాసు వారిని కలిసి వచ్చారు. ప్రస్తుతం చైతన్య ఫోకస్ అంతా ఈ ప్రాజెక్ట్ పైనే ఉంది.
బిజినెస్ పరంగా దూసుకుపోతున్నాడు నాగ చైతన్య. అక్కినేని హీరో మోటర్ రేసింగ్ టీమ్‌కు ఓనర్‌గా మారాడు. హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ రేసింగ్ టీమ్‌ను కొనుగోలు చేశాడు. మోటర్ రేసింగ్ గేమ్‌లో భాగం అవ్వాలనే తన కల ఈ రూపంలో తీరడం ఆనందంగా ఉందని చైతు పేర్కొన్నాడు. ఈ ఏడాది జరిగే ఫార్ములా 4 ఇండియన్ చాంఫియన్‌షిప్‌లో యంగ్ హీరో టీమ్ పోటీచేయబోతుంది. అన్నట్టు.. రేసింగ్ గేమ్స్ పట్ల ముందునుంచి అక్కినేని హీరోలు స్పెషల్ ఇంట్రెస్ట్ చూపుతూ వచ్చారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రేసింగ్ గేమ్స్‌లో నాగార్జునతోపాటు నాగచైతన్య, అఖిల్ సందడి చేశారు. ఇప్పుడు ఏకంగా ఇండియన్ రేసింగ్ టీమ్‌కు ఓనర్ అయిపోయాడు.