కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్.. తనకు అదిరిపోయే పాటలు ఇవ్వాలని బన్నీ అడగడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. జవాన్ సినిమా చూసిన బన్నీ, షారుఖ్‌తోపాటు అనిరుధ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ సందర్భంగా ఈ ముగ్గురి మధ్య జరిగిన సంభాషణ హైలెట్‌గా నిలిచింది.
Allu Arjun: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ లేటెస్ట్ ఫిల్మ్ జవాన్ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు.. వందల కోట్ల కలెక్షన్లు సాధిస్తూ అనేక రికార్డులు బద్దలు కొడుతోంది. ఆరు రోజుల్లో 600 కోట్లు కొల్లగొట్టింది. సినిమా చూసి సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాదు సినీ సెలబ్రిటీలు సైతం ప్రసంశలు కురిపిస్తున్నారు. జవాన్ సినిమా చూసిన అల్లు అర్జున్ చిత్ర యూనిట్ మీద ప్రశంసల వర్షం కురిపించాడు. జవాన్ సినిమాకి పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్, డైరెక్టర్, విజయ్ సేతుపతి, నయనతార, దీపికా వంటి అందరినీ పేరు పేరున అడ్రెస్ చేస్తూ అల్లు అర్జున్ ట్వీట్ చేసాడు.
బన్నీ ట్వీట్‌కి కింగ్ ఖాన్ సూపర్బ్ రిప్లై ఇచ్చాడు. Thank u so much my man.. మూడు రోజుల్లో మూడుసార్లు పుష్ప సినిమా చూశాను. నేను మీ నుంచి ఏదో నేర్చుకున్నానని ఒప్పుకోక తప్పదు. లవ్ యూ బన్నీ.. అంటూ ట్వీట్ చేశాడు షారుఖ్. ఈ ట్వీట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో మరింత జోష్ నింపింది. ఎందుకంటే.. షారుఖ్ ఖాన్ లాంటి హీరో పుష్ప సినిమాని మూడు సార్లు చూడటం అనేది మామూలు విషయం కాదు. అది కూడా ఓపెన్ గా సోషల్ మీడియాలో చెప్పడం చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక బన్నీ ట్వీట్‌కు అనిరుధ్ స్పందిస్తూ.. థాంక్యూ మై బ్రో అని పోస్ట్ చేశాడు. దానికి అల్లు అర్జున్ ఒట్టి థాంక్స్ చెబితే చాలదు, నాకు అదిరిపోయే సాంగ్స్ కావాలి అని రిప్లే ఇచ్చాడు. దానికి అనిరుధ్ రెడీ అని రాసుకొచ్చాడు. దీంతో అట్లీ, బన్నీ ప్రాజెక్ట్ దాదాపుగా కన్ఫామ్ అయిపోయినట్టే. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ ఇవ్వబోతున్నాడనే విషయంలో క్లారిటీ వచ్చేసినట్టేనని చెప్పొచ్చు.