»Mumbai Actress Shivaleeka Oberoi Wedding In Goa Viral Pics
Shivaleeka oberoi: ముంబై బ్యూటీ గోవాలో పెళ్లి..తర్వాత
బాలీవుడ్ నటి శివలీకా ఒబెరాయ్ తన ఫొటో షూట్ చిత్రాలతో కుర్రాళ్లను మత్తెక్కిస్తోంది. పలు ప్రాంతాలను పర్యటిస్తూ సోషల్ మీడియాలో తన చిత్రాలను పోస్ట్ చేస్తూ హంగామా సృష్టిస్తోంది.
నటి శివలీకా ఒబెరాయ్ కవ్వించే అందాలతో కుర్రాళ్లకు గాలం వేస్తుంది.
ముంబయిలో జన్మించిన ఈ అమ్మడు గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే, గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్లో పని చేయడం ప్రారంభించింది.
ఈమె గ్రాడ్యుయేట్ చేస్తున్నప్పుడు అనుపమ్ ఖేర్ యాక్టర్ ప్రిపేర్స్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి 3 నెలల డిప్లొమా కోర్సు చేసింది.
ఆ తర్వాత కిక్ (2014), హౌస్ఫుల్ 3 (2016) చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసింది.
ఈమె తర్వాత మోడలింగ్ చేసి 2019లో రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం యే సాలీ ఆషికితో తన నటనా రంగ ప్రవేశం చేసింది. ఇందులో అమ్రిష్ పూరి మనవడు వర్ధన్ పూరితో కలిసి నటించింది.
రెండవ చిత్రం ఖుదా హఫీజ్ లో కూడా యాక్ట్ చేసింది.
ఈ క్రమంలో చిత్రనిర్మాత అభిషేక్ పాఠక్ తో జూలై 24, 2022న నిశ్చితార్థం చేసుకుని, ఫిబ్రవరి 2023న గోవాలో వివాహం చేసుకున్నారు.