కథ:
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే మూవీ ‘మేము ఫేమస్’ (Mem Famous Movie Review). బండనర్సింపల్లిలో మయి అలియాస్ మహేశ్ (సుమంత్ ప్రభాష్) హీరోగా నటించి దర్శకత్వం వహించిన సినిమా ఇదీ. బాలి అలియాస్ బాలకృష్ణ (మౌర్య చౌదర్య), దుర్గ (మణి ఏగుర్ల) మయి క్లోజ్ ఫ్రెండ్స్. వీరికి ఏ పని పాట లేదు. సరదగా తిరుగుతుంటారు. ఊరిలో చేసే గొడవలతో రచ్చబండ వద్ద ఎప్పుడూ ఓ పంచాయితీ ఉంటుంది. ఊరిలో ప్రతీ ఒక్కరి చేత తిట్టించుకునే వీరు.. ఫేమస్ అవ్వాలని.. అందరి చేత శభాష్ అనిపించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. అందుకోసం ఏం చేశారనెదే కథ.
ఎలా సాగిందంటే..
క్రికెట్ ఎపిసోడ్‌తో మూవీ స్టార్ట్ అవుతుంది. మయి, బాలి, దుర్గా జీవితాలను పరిచయం చేయడంతో కథ మొదలవుతుంది. సినిమాలో కొత్త దనం లేకపోవడం మైనస్. మయి తన మామ కూతురు మౌనిక ప్రేమిస్తాడు. బాలి-బబ్బీ లవ్‌లో ఉంటారు. ఈ ముగ్గురికి సర్పంచ్ వేణు (కిరణ్ మచ్చా), ట్రాక్టర్ డ్రైవర్ అంజిమామ (అంజిమామ మిల్కూరి) మద్దతుగా ఉంటారు. తమకు పేరు తీసుకొచ్చేందుకు పస్టాఫ్‌లో ఫేమస్ టెంట్ హౌస్ పెట్టడం.. ఓ ఎమోషనల్ సీన్‌తో ఇంటర్వెల్ వస్తోంది. సెకండాఫ్‌లో ఫేమస్ యూట్యూబ్ చానెల్ పెట్టి.. వ్యూస్ కోసం పడే పాట్లు మాములగా ఉండవు. ఇందులో కొంత కామెడీ ఉంది. లిప్ స్టిక్ స్పాయిలర్ పాత్ర మూవీకి ప్లస్ అవుతుంది.
ఎవరెలా చేశారంటే..?
మయి పాత్రలో సుమంత్ చాలా చక్కగా నటించారు. ఫస్ట్ మూవీ అయినప్పటికీ ఆకట్టుకున్నాడు. మరికొంత పరిణితి సాధించాల్సి ఉంది. ఫ్రెండ్స్ రోల్ చేసిన మణి, మౌర్య వారి పాత్రల్లో లీనం అయ్యారు. హీరోయిన్స్ అయితే పక్కింటి అమ్మాయిలా సింపుల్‌గా కనిపించారు. అంజిమామ, కిరణ్ మచ్చా, మురళీధర్ గౌడ్ పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించారు. లిప్‌స్టిక్ స్పాయిలర్ రోల్ చేసిన శివనందన్ కామెడీ టైమింగ్ బాగుంది.
సాంకేతిక విభాగాల పనితీరు
కల్యాణ్ నాయక్ మ్యూజిక్ బాగుంది. కథలో భాగంగా పాటలు వస్తాయే తప్ప ఎక్కడా ఇరికించినట్టు అనిపించవు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. గోరెటి వెంకన్న రాసిన ‘గల్లీ చిన్నది’ పాట స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. పల్లెటూరి అందచాలను శ్యామ్ చక్కగా తెరపై చూపించాడు. చాయ్ బిస్కెట్, లహిరి ఫిలింస్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
+ అక్కడక్కడ కామెడీ
+ లిప్‌స్టిక్ స్పాయిలర్ పాత్ర
+ సుమంత్ ప్రభాస్ నటన
మైనస్ పాయింట్స్
– కథలో లేని కొత్త దనం
– సాగదీసేలా ఉండే సన్నివేశాలు
– అంతగా ఆకట్టుకొని ఎడిటింగ్